News August 1, 2024
NLR: ఓ తల్లిదండ్రుల ఆవేదన ఇదీ..!
నెల్లూరు(D) ఉలవపాడు యువకుడు ఒంగోలులో నర్సింగ్ చదువుతున్నాడు. అతని ప్రవర్తనను స్నేహితులు హేళన చేశారు. ఇదే సమయంలో అతడికి హిజ్రాలు పరిచయం కావడంతో ఇంటికి రావడం, తల్లిదండ్రలతో మాట్లాడటం మానేశాడు. మిస్సింగ్ కేసు ఉండటంతో నిన్న అతడిని ఉలవపాడు స్టేషన్‌కు తీసుకొచ్చారు. 150 మంది హిజ్రాలు అక్కడికి చేరుకుని గొడవ చేశారు. ఎవరితో వెళ్లాలి అనే నిర్ణయం అతడికి వదిలేయగా హిజ్రాలతో వెళ్లడంతో తల్లిదండ్రులు విలపించారు.
Similar News
News January 16, 2025
రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది: కాకాణి
రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం పొదలకూరు మండల పరిధిలోని పులికల్లు, నేదురుమల్లి, వెలికంటి పాలెం, శాంతినగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన ఇష్టా గోష్టి నిర్వహించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటానని తెలిపారు.
News January 16, 2025
ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయండి: కలెక్టర్
ఈ నెల 18, 19, 20వ తేదీలలో సూళ్లూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ కోరారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. చాలా కాలం తరువాత ఈ పండుగను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామాలలో ప్రజలందరికి ఈ సమాచారం అందించాలన్నారు. పండుగకు వచ్చే సందర్శకులకు తాగునీరు, టాయిలెట్స్, వైద్య సౌకర్యం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
News January 16, 2025
నెల్లూరు: తిరుగు ప్రయాణంలో నిలువ దోపిడి
సంక్రాంతికి సొంతూర్లకు వచ్చి తిరిగి వెళ్లేవారికి ప్రయాణం ఖరీదుగా మారింది. నెల్లూరుజిల్లా నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి RTC అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అవి సరిపోకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించారు. దీంతో వారు టికెట్ రేట్లను రెండింతలు పెంచి నిలువ దోపిడి చేస్తున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సిరావడంతో ప్రజలు అధిక ధరలు చెల్లించి ప్రయాణిస్తున్నారు.