News October 15, 2025
NMMS పరీక్ష దరఖాస్తు గడువు పెంపు: నిర్మల్ డీఈవో

NMMS పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పెంచినట్లు డీఈఓ భోజన్న తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMS) పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు చేసుకోవడానికి ఈ నెల 18 వరకు గడువు ఉందన్నారు. వివరాల కోసం http://bse.telangana.gov.in వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Similar News
News October 15, 2025
సీఎంఆర్ సమర్పించిన వారికే ధాన్యం: వనపర్తి కలెక్టర్

గత ఖరీఫ్ సీజన్ 2024-25లో వరి ధాన్యం పొందిన వారిలో వంద శాతం CMR సమర్పించిన వారికే ఖరీఫ్ 2025-26 సీజన్ ధాన్యం కేటాయిస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం NIC కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్‌తో కలిసి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 12లోపు పెండింగ్ సీఎంఆర్ పూర్తి చేసి కొత్త ధాన్యం పొందడానికి సహకరించాలని రైస్ మిల్లర్లకు సూచించారు.
News October 15, 2025
రోడ్డు భద్రత కోసం అన్నమయ్య పోలీసుల ‘బొమ్మ’ కథ

ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న రహదారులపై ప్రాణాలను కాపాడేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తుపాకులు, లాఠీల కంటే సృజనాత్మక ఆలోచనే గొప్ప ఆయుధం అని నిరూపించేలా, మదనపల్లె సబ్-డివిజన్ యంత్రాంగం ఒక వినూత్న ‘కటౌట్ కథ’ ను ప్రారంభించింది. కానిస్టేబుల్ ఆకారపు బొమ్మను ఉంచారు. ఈ కటౌట్‌లను చూసిన వాహనదారులు, నిజంగానే పోలీసులు తనిఖీ అని భ్రమపడి, వెంటనే వేగాన్ని తగ్గించుకుంటున్నారు.
News October 15, 2025
తెనాలి: Way2News కథనానికి స్పందన

‘నో స్టాక్’ బోర్డు పేరుతో రేషన్ షాపులపై Way2Newsలో వచ్చిన <<18010930>>కథనానికి <<>>తహశీల్దార్ గోపాలకృష్ణ స్పందించారు. బుధవారం ఆయన పలు రేషన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. నాజరుపేట, రామలింగేశ్వరపేట సహా మరికొన్ని డిపోలను పరిశీలించారు. స్టాక్ వివరాలు చెక్ చేసి, డీలర్లతో మాట్లాడారు. సకాలంలో రేషన్ ఇవ్వాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని హెచ్చరించారు. రేషన్ సమస్యలు ఉంటే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు.