News September 23, 2025

NMMS స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు: DEO

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్‌నకు ఎంపికైన విద్యార్థుల సౌకర్యార్థం రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు DEO వెంకటలక్షమ్మ మంగళవారం ప్రకటించారు. 2021, 2022, 2023లో ఎంపికైన విద్యార్థులు https://scholarships.gov.in పోర్టల్‌లో రెన్యువల్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ కాకపోతే స్కాలర్షిప్ జమ కాదని తెలిపారు.

Similar News

News September 23, 2025

MBNR: మాజీ కౌన్సిలర్‌పై కేసు నమోదు

image

మాజీ కౌన్సిలర్ కట్ట రవికిషన్ రెడ్డి అసభ్య పదజాలాలతో తనను దూషించారని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆధారాలతో కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ మీడియాకు తెలిపారు. మాజీ కౌన్సిలర్ రవికిషన్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు, చట్టప్రకారం ముందుకు వెళ్తామని మహబూబ్‌నగర్ వన్ టౌ సీఐ అప్పయ్య పేర్కొన్నారు.

News September 23, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓మాదకద్రవ్యాల నివారణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ జితేష్
✓ పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలి: కలెక్టర్ జితేష్
✓యూరియా కోసం లక్ష్మీదేవిపల్లిలో రైతుల రాస్తారోకో
✓వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలు
✓అశ్వారావుపేట: 13 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్
✓భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
✓బూర్గంపాడు, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ

News September 23, 2025

KNR: హైపటైటిస్ వ్యాక్సినేషన్ పరిశీలించిన కలెక్టర్

image

వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న హైపటైటిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. నేషనల్ వైరల్ హైపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా హైపటైటిస్ వ్యాధిగ్రస్తుల నుండి వైద్యులు, సిబ్బందికి వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్తగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.