News July 10, 2024

వింబుల్డన్ నుంచి నం.1 ర్యాంకర్ ఔట్

image

వింబుల్డన్(టెన్నిస్) మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచులో టాప్ సీడ్ సిన్నర్‌కు ఐదో సీడ్ మెద్వెదెవ్ షాకిచ్చారు. హోరాహోరీగా సాగిన మ్యాచులో 6-7, 6-4, 7-6, 2-6, 6-3 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. మరో మ్యాచులో పాల్‌పై మూడో సీడ్ అల్కరాజ్ విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ సెమీస్‌కు దూసుకెళ్లారు. ఇవాళ జరిగే క్వార్టర్స్‌లో జకోవిచ్-మినార్, ముసెట్టి-ప్రిట్జ్ మధ్య పోరు జరగనుంది.

Similar News

News April 2, 2026

హార్ముజ్‌లో ఇండియన్స్ సేఫ్: ఇరాన్

image

హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతపై ఇరాన్ భరోసా ఇచ్చింది. ‘మా ఇండియన్ ఫ్రెండ్స్ సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నారు’ అని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. ఇండియాకు రావాల్సిన 19 చమురు నౌకలతో పాటు వేలాది మంది భారత సిబ్బంది యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం జరిపిన దౌత్య చర్చల ఫలితంగా ఇప్పటికే కొన్ని నౌకలు సేఫ్‌గా స్వదేశానికి చేరుకున్నాయి.

News April 2, 2026

బీజేపీతో జాగ్రత్త.. TDPకి ఆప్ ఎంపీ హెచ్చరిక

image

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక పార్టీలను మోసం చేసిన చరిత్ర బీజేపీదని, ఆ పార్టీ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పుడు అధికారం చంద్రబాబు చేతుల్లోనే ఉందని, కేంద్రం నుంచి ఎంత రాబట్టుకోవాలో అంత రాబట్టుకోవాలని సూచించారు.

News April 2, 2026

ఆప్ డిప్యూటీ నేతగా రాఘవ్ చద్దా తొలగింపు!

image

రాజ్యసభలో తమ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దాను ఆప్ తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌(పంజాబ్)ను నియమించినట్లు రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాసింది. పార్లమెంటులో మాట్లాడేందుకు ఆయనకు సమయం ఇవ్వొద్దని కోరింది. పార్టీకి, చద్దాకు మధ్య విభేదాలు వచ్చాయనే వార్తల నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవల వరుసగా ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతూ చద్దా వార్తల్లో నిలిచారు.