News April 7, 2025
28 ఏళ్లుగా నో యాక్టింగ్..అయినా రిచ్చెస్ట్ పర్సన్

వ్యాపార వేత్తగా సక్సెస్ సాధించిన మెకాలే కుల్కిన్ మూడేళ్ల వయసులోనే టీవీషోలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. 1992లో వచ్చిన మైటీ డక్స్ మూవీతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1997లోనే నటనకు వీడ్కోలు పలికి వ్యాపారం ప్రారంభించారు. ఇంటర్నెట్ గేమింగ్ ఎంటర్టైన్మెంట్ స్థాపించి సక్సెస్ సాధించారు. నటనకు వీడ్కోలు పలికినప్పటికీ సినిమా ఫీల్డ్‌లో మెకాలేనే రిచ్చెస్ట్ యాక్టర్‌గా భావిస్తారు.
Similar News
News April 8, 2025
రూ. రెండున్నర లక్షలు కొట్టేసి సారీ లెటర్ పెట్టాడు!

ఓ దుకాణంలో రూ.2.45 లక్షలు దోచుకున్న దొంగ, తనను క్షమించమంటూ ఓ లేఖ అక్కడ వదిలి వెళ్లాడు. ‘అప్పుల్ని తీర్చుకునేందుకు ఈ చోరీ చేస్తున్నా. రామనవమి రోజు చేస్తున్న ఈ దొంగతనానికి నన్ను క్షమించండి. నాకు కావాల్సినంత మాత్రమే తీసుకున్నా. 6 నెలల్లో తిరిగిచ్చేస్తాను. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేయించుకోండి’ అని అందులో రాశాడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనీలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
News April 8, 2025
‘ఆక్వా’కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు: ఆనం

AP: CM చంద్రబాబు ఆక్వా సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారని TDP సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. ‘త్వరలోనే బాబు ఢిల్లీకి వెళ్లి వాణిజ్యమంత్రిని కలుస్తారు. US సుంకాల కారణంగా ఆక్వా సంక్షోభం తలెత్తింది. దీనిపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. చైనా, థాయ్‌లాండ్‌కు ఎగుమతి చేసే మార్గాన్ని పరిశీలించాలని సూచించారు’ అని పేర్కొన్నారు.
News April 8, 2025
విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ముంబైకు వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. అప్పటికే ముంబై సమీపించిన విమానాన్ని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించారు. రాత్రి 8.50కి ల్యాండ్ అయిన విమానాన్ని వెంటనే దూరంగా తరలించి తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు. విమానంలోని 225మందిని సురక్షితంగా కిందికి దించామని, ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని స్పష్టం చేశారు.