News October 5, 2025
కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: కేజ్రీవాల్

2027 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తమకు పొత్తు ఉండదని AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ BJPకి MLAలను సరఫరా చేసే పార్టీగా మారింది. భవిష్యత్తులో తమ MLAలు ఎవరూ BJPలోకి వెళ్లరని ఓటర్లకు కాంగ్రెస్ హామీ ఇవ్వగలదా? 2017-19 మధ్య 13 మంది, 2022లో 10 మంది కాంగ్రెస్ MLAలు BJPలో చేరారు’ అని గోవాలో జరిగిన పార్టీ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు.
Similar News
News October 5, 2025
ఈ నెల 9న OTTలోకి ‘వార్-2’!

హృతిక్ రోషన్, Jr.NTR నటించిన ‘వార్-2’ సినిమా ఈ నెల 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై ఆ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ టు డిజిటల్ విండో ప్రకారం బాలీవుడ్ సినిమాలు 8 వారాల్లో, టాలీవుడ్ మూవీలు 4 వారాల్లో OTTలో రిలీజ్ అవుతున్నాయి.
News October 5, 2025
610 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే ఆఖరు తేదీ

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 610 ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ(OCT 7). బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీర్) ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రాతపరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష బెంగళూరులో అక్టోబర్ 25, 26తేదీల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.177. వెబ్‌సైట్: https://bel-india.in/
News October 5, 2025
గేదెను కొంటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి

గేదెను కొనుగోలు చేసేటప్పుడు అది ఎప్పుడు ఈనింది, ఎన్నవ ఈతలో ఉంది, ఈనిన తర్వాత ఎన్ని నెలలు పాడిలో ఉంది, కట్టినట్లయితే ఎన్ని నెలలు గర్భంలో ఉంది, వట్టి పోయి ఎంతకాలమైంది, ఈనడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది అనే విషయాలను తప్పకుండా యజమానిని అడిగి తెలుసుకోవాలి. సంతలో పశువులను కొనుగోలు చేయాలనుకుంటే వాటికి రంగులు వేశారా? కొమ్ములు చెక్కారా? వంటివి గమనించి కొనాలి. పొదుగు జబ్బు వచ్చిన గేదెలు కొనకూడదు.