News April 14, 2024
కాంగ్రెస్‌తో పొత్తు లేదు: ఒవైసీ
TG: ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. MP ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు లేదని స్పష్టం చేశారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. కాంగ్రెస్, BJPలతో దేశానికి ఒరిగేదేమీ లేదని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో MIMకు విజయం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఇంకా హైదరాబాద్ MP అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉందనే ప్రచారం నేపథ్యంలో ఒవైసీ క్లారిటీ ఇచ్చారు.
Similar News
News November 16, 2024
గుడ్ న్యూస్.. ఫీజు చెల్లించేందుకు గడువు పెంపు
TG: పదవ తరగతి విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు విద్యాశాఖ గడువు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఎల్లుండితో గడువు ముగియనుండగా ఈ నెల 28 వరకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. చలానా విధానాన్ని రద్దు చేస్తూ, పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యాన్ని తీసుకొచ్చింది.
News November 16, 2024
నీటిని పీల్చుకునే ‘ట్రోవాంట్స్’ రాళ్లు!
యూరప్‌లోని రొమేనియాలో ఉన్న వింత రాళ్లు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘ట్రోవాంట్స్’ అని పిలిచే ఈ ప్రత్యేకమైన రాళ్లు వర్షాలు పడిన తర్వాత వాటంతటవే పెరిగిపోతుంటాయి. అప్పటివరకూ సాధారణ శిలల్లా కనిపించే ఈ భౌగోళిక అద్భుతాలు వర్షపు నీటిని పీల్చుకుని పరిమాణాన్ని పెంచుకుంటాయి. అచ్చం జీవిలానే ప్రవర్తిస్తాయి. ఈ దృగ్విషయం స్థానికులు, శాస్త్రవేత్తలు సైతం అవాక్కయ్యేలా చేస్తోంది.
News November 16, 2024
ట్రంప్‌ను చంపే ఆలోచన లేదు: ఇరాన్
ట్రంప్‌ను హత్య చేసే ఆలోచన తమకు లేదని అమెరికాకు ఇరాన్ వివరణ ఇచ్చింది. Sepలో ఇరాన్‌తో జో బైడెన్ యంత్రాంగం సమావేశమైంది. ట్రంప్‌పై ఏరకమైన దాడి జరిగినా దాన్ని యుద్ధ చర్యగా పరగణిస్తామని US స్పష్టం చేసింది. దీంతో Octలో ఇరాన్ ‘ఆ ఆలోచన లేద’ని బదులిచ్చినట్టు సమాచారం. 2020లో ట్రంప్ ఆదేశానుసారం జరిగిన దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమాని హతమవ్వడంతో ఇద్దరి మధ్య రగడ ప్రారంభమైంది.