News November 1, 2024
3 దశాబ్దాలుగా ఈ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగ్ పోలేదు

జపాన్‌లోని కాన్సాయ్ విమానాశ్రయంలో 30 ఏళ్లుగా ఒక్క ప్రయాణికుడి బ్యాగు కూడా మిస్ కాలేదు. ప్రతి రోజూ 3,000 బ్యాగులు చెక్ చేస్తున్నా 15 నిమిషాల్లోనే ప్రయాణికులకు అప్పగిస్తున్నారు. జపాన్‌లోనే రద్దీ ఎయిర్‌పోర్టుల్లో ఒకటైన కాన్సాయ్లో నిబంధనల వల్లే అవి మిస్ కావడం లేదు. ఇది ‘వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఫర్ బ్యాగేజీ డెలివరీ’గా నిలిచింది. ఈ విమానాశ్రయం నుంచి ఏటా 2.5 కోట్ల మంది ప్రయాణిస్తుంటారు.
Similar News
News January 9, 2026
16 ఏళ్లు నిండితేనే గిగ్ వర్కర్‌గా నమోదు

గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లుగా నమోదవడానికి 16 ఏళ్లు నిండినవారే అర్హులని కేంద్ర కార్మికశాఖ ఇటీవల వెల్లడించింది. ఆధార్, ఇతర డాక్యుమెంట్ల ద్వారా ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంది. రిజిస్టరయిన ప్రతి కార్మికుడికి ప్రత్యేక UAN వస్తుంది. తర్వాత ఫొటో, ఇతర వివరాలతో డిజిటల్ కార్డు జారీ అవుతుంది. వీరు సామాజిక భద్రత పథకాలకు అర్హులు అవుతారు. కార్మికులు ఏడాదిలో కనీసం 90 రోజులు <<18740165>>పనిచేయాల్సి<<>> ఉంటుంది.
News January 9, 2026
నాణ్యత లేదని కొన్న పంటను తిరిగి పంపేశారు

TG: సోయాపంట విక్రయించిన రైతులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రైతులు అమ్మిన సోయా గింజల్లో నాణ్యత లేదంటూ వేలాది క్వింటాళ్ల సోయా బస్తాలను వెనక్కి తిరిగి పంపుతున్నారు. ఆ బస్తాలను తిరిగి తీసుకెళ్లాలని రైతులకు ఫోన్ చేసి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి సహా ఇతర జిల్లాల్లో సోయా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
News January 9, 2026
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ట్రంప్ సుంకాల వార్నింగ్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై ఇవాళ కూడా కనిపిస్తోంది. సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 66,907 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 25,861 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ICICI బ్యాంక్, అదానీ పోర్ట్స్, NTPC, ట్రెంట్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, HDFC, హిందుస్తాన్ యునిలీవర్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియడంతో రూ.7.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.


