News October 10, 2025

ట్రంప్‌కు ‘నో’బెల్.. పాక్ గొంతులో వెలక్కాయ!

image

పాక్‌కు ప్రతిచోటా భంగపాటే ఎదురవుతోంది. Op సిందూర్‌తో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నారు. SMలో ఫేక్ ఫొటోలతో నవ్వులపాలయ్యారు. వైట్‌హౌస్‌కెళ్లిన అసిఫ్ మునీర్, షెహబాజ్ షరీఫ్ ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఫొటోలకు పోజులిచ్చి డాంబికాలకు పోయారు. శాంతిదూతంటూ నోబెల్‌కు సిఫార్సు చేశారు. తీరాచూస్తే నార్వే కమిటీ వారినసలు పట్టించుకోనే లేదని తెలియడంతో వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టైందని SMలో నెటిజన్లు నవ్వేస్తున్నారు.

Similar News

News October 10, 2025

పిల్లలు క్రాకర్స్ కాల్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి.. సుప్రీంకు వినతి

image

ఢిల్లీలో బాణసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. దేశ రాజధానిలో ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం దృష్ట్యా బాణసంచా విక్రయం, వినియోగంపై ఈ ఏడాది APRలో SC నిషేధం విధించింది. ఇవాళ దీనిపై విచారణ జరగగా పండుగ కోసం పిల్లలు ఎదురుచూస్తున్నారని, పర్యావరణహితమైన క్రాకర్స్‌‌కు అనుమతించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీపావళి రోజు రా.8-10 గంటల మధ్య పర్మిషన్ ఇవ్వాలన్నారు.

News October 10, 2025

నోబెల్ బహుమతి ట్రంప్‌కు అంకితం: మరియా

image

వెనిజులా ప్రజలకు మద్దతిచ్చిన US అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని అంకితమిస్తున్నట్లు ఉద్యమకారిణి మరియా మచాడో ప్రకటించారు. ట్రంప్‌తో పాటు నిర్విరామంగా పోరాడుతున్న తమ దేశ ప్రజలకు, అండగా నిలబడ్డ ప్రపంచ దేశాలకు ఈ బహుమతి డెడికేట్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య దేశాలు తమకు ప్రధాన మిత్రులని చెప్పారు. ఫ్రీడమ్ సంపాదించడానికి నోబెల్ ప్రకటన మరింత ప్రోత్సాహాన్నిస్తుందని ఆమె వివరించారు.

News October 10, 2025

మంత్రులూ! ప్రాజెక్టుల పూర్తి బాధ్యత మీదే: CBN

image

AP: శాఖలను సమర్థంగా నడపాల్సిన బాధ్యత మంత్రులదేనని CM CBN స్పష్టం చేశారు. ‘గతంలో లేనన్ని పెట్టుబడులు వస్తున్నాయి. శాఖల అధికారులతో మాట్లాడి త్వరగా పనులు చేయించండి. మాట వినకుంటే గట్టిగా చెప్పండి. అవి సకాలంలో పూర్తికావాలి. ప్రజలకూ చెప్పాలి. ఎన్నికల్లో పోటీచేసేది మీరే అని తెలుసుకోండి’ అని క్యాబినెట్ చివర్లో సీఎం హితబోధ చేసినట్లు సమాచారం. YCP కుట్రల్ని తిప్పికొట్టాలని నిన్నకూడా వారికి బాబు సూచించారు.