News November 27, 2024
మాపై లంచాల ఆరోపణలే లేవు: DOJ, SECపై అదానీ గ్రూప్ ఫైర్
భారత అధికారులకు లంచాలు ఇచ్చినట్టు US డిస్ట్రిక్ట్ కోర్టు తమ ప్రతినిధుల్లో ఎవ్వరిపైనా అభియోగాలు నమోదు చేయలేదని <<14721709>>అదానీ<<>> గ్రూప్ వివరించింది. అజూర్ పవర్, CDPQ ప్రతినిధులైన రంజిత్, సిరిల్, సౌరభ్, , దీపక్, రూపేశ్పై ఆరోపణలు చేసినట్టు తెలిపింది. తమ ప్రతినిధులపై ఎలాంటి ఎవిడెన్సూ DOJ చూపలేదని విమర్శించింది. ఎవరో చెప్పింది విని చర్యలు తీసుకోవడం చట్టపరంగా, నైతికంగా DOJ, SEC దిగజారుడు తత్వానికి నిదర్శనమంది.
Similar News
News November 27, 2024
ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతిపై పునరాలోచిస్తాం: ప్రభుత్వం
TG: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం పరిశ్రమకు ఇచ్చిన అనుమతిపై పునరాలోచన చేస్తామని తెలిపింది. అవసరమైతే పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని సర్కార్ యోచిస్తోంది. కాగా, ఆ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ మూడు, నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు.
News November 27, 2024
ఐసీసీ ర్యాంకింగ్స్: తొలి స్థానంలో బుమ్రా
ICC ప్రకటించిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. బ్యాటింగ్లో జైస్వాల్ రెండో స్థానంలో, పంత్ 6, విరాట్ కోహ్లీ 13వ స్థానంలో నిలిచారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా తొలి స్థానం, అశ్విన్ 4, జడేజా 7వ స్థానం పొందారు. ఆల్ రౌండర్లలో జడేజా తొలి స్థానం, అశ్విన్ 2, అక్షర్ పటేల్ ఏడో స్థానంలో నిలిచారు. ఇటీవల AUSతో తొలి టెస్టులో జైస్వాల్, కోహ్లీ సెంచరీలు చేయగా, బుమ్రా 8 వికెట్లతో రాణించారు.
News November 27, 2024
మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించవు: సుప్రీంకోర్టు
రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మతంపై నమ్మకంతో మారితే తప్పులేదంది. బాప్టిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరని చెప్పింది. హిందూమతాన్ని ఆచరిస్తుండటంతో ఉద్యోగంలో కోటా కోసం తనకు SC సర్టిఫికెట్ ఇవ్వాలని TN యువతి సెల్వరాణి వేసిన కేసును మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దానిని సవాల్ చేయగా ఆ తీర్పు సరైందేనని సుప్రీంకోర్టూ తెలిపింది.