News July 24, 2024

హార్దిక్‌కు నో కెప్టెన్సీ.. ఇప్పుడు గౌతీ టైమ్

image

హార్దిక్‌ను కాదని సూర్యను టీ20 కెప్టెన్‌గా నియమించడం ఆశ్చర్యంగా అనిపించలేదని జీటీ కోచ్ ఆశిష్ నెహ్రా అన్నారు. ‘ఇలాంటివి సహజమే. ప్రతి కోచ్, కెప్టెన్‌కు సొంత ఆలోచనలు ఉంటాయి. పైగా కోచ్ మారారు. ఇప్పుడు గౌతీ మార్గనిర్దేశం చేస్తున్నాడు. షార్ట్ ఫార్మాట్లో పాండ్య కీలకం. అతనుంటే నలుగురు పేసర్లు సరిపోతారు. అతడి ఫిట్‌నెస్ పరిమితుల్ని బట్టి గంభీర్, అగార్కర్ తీసుకున్న నిర్ణయం కరెక్టే’ అని నెహ్రా పేర్కొన్నారు.

Similar News

News December 1, 2025

గుంటూరులో వ్యభిచార ముఠా అరెస్ట్

image

గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారంపై టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. గాంధీ పార్క్ వెనుక ఉన్న రామిరెడ్డి నగర్‌లోని ఒక లాడ్జ్‌పై దాడి చేసి, ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.

News December 1, 2025

CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

image

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్‌నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

News December 1, 2025

₹50వేల కోట్ల దావా.. AERA పక్షాన కేంద్రం!

image

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ప్రైవేట్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) ఆఫ్ ఇండియా మధ్య ₹50వేల కోట్ల దావా SCకు చేరింది. ఇందులో కేంద్రం AERA పక్షాన నిలిచింది. రెగ్యులేటెడ్ సర్వీసెస్ కోసం కాలిక్యులేట్ చేసే అసెట్స్ క్యాపిటల్ వ్యాల్యూపై విభేదాలున్నాయి. ఆపరేటర్లు గెలిస్తే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో యూజర్ డెవలప్మెంట్ ఫీజు ₹129 నుంచి ₹1261కి, ముంబైలో ₹175 నుంచి ₹3,856కు పెరుగుతుంది.