News November 3, 2024

వ్యాయామానికి వెళ్లేటప్పుడు సెల్‌ఫోన్ వద్దు: వైద్యులు

image

వ్యాయామానికి వెళ్లేటప్పుడు సెల్‌ఫోన్, ఇయర్ ఫోన్స్ వదిలేయాలని డాక్టర్.శ్రీకాంత్ మిర్యాల సూచిస్తున్నారు. అవి లేకుండా వ్యాయామం చేయడం వల్ల జాగరూకతతో ఉండవచ్చని చెబుతున్నారు. తద్వారా వ్యాయామం చేసేటప్పుడు ఒంట్లో కదలికలు, ఊపిరి, చెమట వల్ల వచ్చే చిరాకు, అలసట, బరువులెత్తేటప్పుడు మనలోని సామర్థ్యం వంటివి అనుభూతి చెందవచ్చంటున్నారు. అవన్నీ మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని చెబుతున్నారు.

Similar News

News January 1, 2026

ఎల్లుండే టీమ్ ప్రకటన.. షమీ రీఎంట్రీ?

image

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును ఈ నెల 3న BCCI ఎంపిక చేయనుంది. ఇటీవల సౌతాఫ్రికాతో మ్యాచులకు దూరమైన గిల్ తిరిగి టీమ్‌లోకి రానున్నారు. సీనియర్ ప్లేయర్లు హార్దిక్, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్ ఈ సిరీసూ ఆడబోరని సమాచారం. ఎన్నాళ్ల నుంచో కమ్‌బ్యాక్ కోసం చూస్తున్న షమీ రీఎంట్రీ ఇవ్వొచ్చు. సర్ఫరాజ్‌కూ చోటు దక్కే ఛాన్స్ ఉంది. JAN 11న తొలి వన్డే జరగనుంది.

News January 1, 2026

డ్రంకెన్ డ్రైవ్.. రీడింగ్ చూస్తే షాకే!

image

TG: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబు రీడింగ్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. నిన్న రాత్రి వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తికి బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేయగా ఏకంగా 438 రీడింగ్ నమోదైంది. న్యూఇయర్ వేళ డ్రంకెన్ డ్రైవ్‌లో నమోదైన రీడింగ్‌ల్లో ఇదే అత్యధికమని ఏఎస్పీ శుభం ప్రకాశ్ తెలిపారు. కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

News January 1, 2026

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత దేవా

image

TG: మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సె దేవా అలియాస్ సుక్కాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన దేవాపై రూ.50 లక్షల రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు. మరో 15 మంది కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా గతంలో పనిచేశారు.