News March 21, 2024

AP పాలిసెట్ తేదీలో మార్పు లేదు: కమిషనర్

image

ఏపీ పాలిసెట్ నిర్వహణ తేదీలో మార్పు ఉండదని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 27న పరీక్ష జరుగుతుందన్నారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పాలిసెట్‌ను మే 17 నుంచి 24వ తేదీకి మార్చారు.

Similar News

News October 19, 2025

మ్యాచ్ రీస్టార్ట్.. 26 ఓవర్లకు కుదింపు

image

భారత్, ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌‌కు వర్షం అంతరాయం కారణంగా అంపైర్లు ఓవర్లను 26కు కుదించారు. వర్షం కాస్త తెరిపినివ్వడంతో మ్యాచ్ రీస్టార్ట్ అయింది. 18 ఓవర్లలో భారత్ 4 వికెట్లు కోల్పోయి 65 రన్స్ చేసింది. మరో 8 ఓవర్లు మాత్రమే మిగిలున్నాయి. అక్షర్(25*), రాహుల్ (5*) క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లలో కనీసం 130 రన్స్ టార్గెట్ నిర్దేశిస్తేనే భారత్‌ పోరాడేందుకు అవకాశం ఉండనుంది.

News October 19, 2025

దూడలలో తెల్లపారుడు వ్యాధి లక్షణాలు

image

గేదె, సంకర జాతి దూడల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి సోకిన దూడలు తెల్లగా పారతాయి. దీని నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధికి గురైన దూడల శరీరం నుంచి నీరు కోల్పోయి కళ్లగుంటలు బాగా లోపలికి పోయి ఉంటాయి. చర్మము ముడతలు పడి ఉంటుంది. చివరకు వ్యాధి తీవ్రంగా మారితే దూడ ఎక్కువగా పారి నీరసించి చనిపోతుంది. అందుకే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వెటర్నరీ వైద్యునికి చూపించాలి.

News October 19, 2025

రాష్ట్ర నేతలకు బండి సంజయ్ వార్నింగ్

image

TG: మావోయిస్టులకు మద్దతిస్తున్న రాష్ట్ర రాజకీయ నేతలకు కేంద్రమంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తూ నక్సలైట్లకు మద్దతిస్తున్నవారు వెంటనే తమ సంబంధాలను తెంచుకోవాలి. కేంద్ర ఏజెన్సీలు మావోయిస్టుల విషయంలో వెనక్కి తగ్గవు. అవినీతి, నేరాలకు రక్షణ కల్పిస్తున్న వారిని కేంద్రం ట్రేస్ చేస్తోంది. దేశ భద్రత విషయంలో ఎంతటివారినైనా జాలి చూపకుండా ఏరివేస్తుంది’ అని ట్వీట్ చేశారు.