News April 3, 2025
PPF నామినీ పేర్లను మార్చేందుకు ఛార్జీలుండవు: నిర్మల

PPF అకౌంట్లలో నామినీ పేర్లను మార్చేందుకు కొన్ని ఆర్థిక సంస్థలు డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పేర్ల మార్పు, అప్డేట్ కోసం గతంలో రూ.50 వసూలు చేేసేవారని, ప్రస్తుతం ఆ ఛార్జీలు చెల్లించే అవసరం లేకుండా గెజిట్ తీసుకొచ్చామన్నారు. అలాగే, తాజాగా తీసుకొచ్చిన బ్యాంకింగ్ సవరణ బిల్లు ప్రకారం నలుగురు నామినీలను చేర్చుకోవచ్చని పేర్కొన్నారు.
Similar News
News April 4, 2025
రేషన్ షాపుల వద్ద నో స్టాక్ బోర్డులు!

TG: రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోంది. 3 రోజుల్లో దాదాపు 41వేల టన్నులకు పైగా బియ్యాన్ని సరఫరా చేసినట్లు సమాచారం. సన్నబియ్యం ఇస్తుండడంతో రేషన్ షాపులకు జనం భారీగా వస్తున్నారు. దీంతో మేడ్చల్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లోని దుకాణాల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. మళ్లీ స్టాక్ తెప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మీరు బియ్యం తెచ్చుకున్నారా? క్వాలిటీ ఎలా ఉంది?
News April 4, 2025
SRH చెత్త రికార్డ్

SRH నిన్న KKRతో ఓడిపోయి ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. 2023 నుంచి ఒకే జట్టుపై వరుసగా 5సార్లు ఓడిపోయింది. 2023లో 1, 2024లో 3, నిన్న కోల్కతా మ్యాచ్లో పరాజయాలు చవిచూసింది. మరోవైపు, ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచుల్లోనూ 3 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. గతంతో పోలిస్తే SRH పటిష్ఠంగానే కనిపిస్తున్నా వరుస ఓటములు ఊహించనివి. టాప్ ఆర్డర్ వైఫల్యమే ఆ జట్టుకు శాపంగా కన్పిస్తోంది.
News April 4, 2025
రాష్ట్రంలో నియంత్రణలోనే ఎయిడ్స్.. స్థానం మెరుగుదల

AP: ఎయిడ్స్ నియంత్రణలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మంచి పనితీరు కనబరిచింది. గతేడాది వరకు 17వ స్థానంలో ఉన్న ఏపీ ప్రస్తుతం 7వ ప్లేస్కు చేరినట్లు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(న్యాకో) తెలిపింది. 2024 APR- DEC మధ్య మంచి పనితీరు కనబరిచినట్లు చెప్పింది. 2004 నుంచి రాష్ట్రంలో దాదాపు 2,25,000 మంది బాధితుల్ని గుర్తించినట్లు వెల్లడించింది. వ్యాధి నియంత్రణకు రూ.127cr ఖర్చు చేసినట్లు న్యాకో పేర్కొంది.