News January 8, 2025

పిల్లలొద్దు.. పెట్సే ముద్దంటున్నారు!

image

ఇండియాలో జననాల రేటు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఈక్రమంలో మార్స్ పెట్‌కేర్ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇండియాలో జనరేషన్ Z& మిలీనియల్స్‌కు చెందిన 66శాతం మంది పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగా భావిస్తున్నారు. వీరు ‘పెట్ పేరెంటింగ్’ను స్వీకరించడంతో జంతువుల సంరక్షణ పరిశ్రమ అభివృద్ధి చెందినట్లు పేర్కొంది. పట్టణ జీవితంలో ఒత్తిడి తగ్గించేందుకు ఇదో పరిష్కారంగా భావిస్తున్నారంది.

Similar News

News November 26, 2025

కలెక్టరేట్‌కు ప్రభుత్వం ఒకపైసా మంజూరు చేయలేదు: శ్రీకాంత్ రెడ్డి

image

రెండేళ్ల క్రితమే రూ.100 కోట్ల నిధులతో అప్రూవ్ అయిన రాయచోటి కలెక్టరేట్‌కు కూటమి ప్రభుత్వం ఒక్కపైసా మంజూరు చేయలేదని YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అమరావతి నిర్మాణానికి పెట్టే ఖర్చులో 0.1 శాతం నిధులను కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెట్టక పోవడం ఏంటని ప్రశ్నించారు. స్వార్థం లేకుండా, కేవలం రాయచోటిని మంచి పట్టణంగా తీర్చిదిద్దడానికి కృషి చేశానన్నారు.

News November 26, 2025

₹7,280 కోట్లతో రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌ పథకం

image

రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌ ఎగుమతులపై చైనా ఆంక్షల నేపథ్యంలో కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఏటా 6K మెట్రిక్ టన్నుల సామర్థ్యమే లక్ష్యంగా ₹7,280 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. గ్లోబల్ బిడ్డింగ్‌తో 5 సంస్థలను ఎంపిక చేస్తామని, ఒక్కో సంస్థకు 1,200 MTPA సామర్థ్యం నిర్దేశిస్తామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

News November 26, 2025

చటేశ్వర్ పుజారా బావమరిది ఆత్మహత్య

image

భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా బావమరిది జీత్ పబారీ ఆత్మహత్య చేసుకున్నారు. గుజరాత్ రాజ్‌కోట్‌లోని తన నివాసంలో ఉరేసుకున్నారు. అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి పబారీపై గతేడాది అత్యాచారం కేసు పెట్టింది. అప్పటి నుంచి ఆ కేసు విచారణలో ఉండగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పుజారా భార్య పూజ సోదరుడే జీత్ పబారీ.