News September 17, 2024

గతంలోలాగా మందులపై సీఎం బొమ్మ లేదు: TDP

image

AP: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర మందుల కిట్లను అందిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను టీడీపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘గత ప్రభుత్వంలో ఉన్నట్లు ఇప్పుడు మందుల మీద ఎక్కడా జగన్ రెడ్డి బొమ్మ లేదు’ అని పేర్కొంది.

Similar News

News November 25, 2025

సాయంత్రం టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్

image

మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచులు, వేదికల వివరాలను రోహిత్, సూర్య, మాథ్యూస్, హర్మన్‌తో ICC రివీల్ చేయించనుంది. IND, శ్రీలంక సంయుక్తంగా హోస్ట్ చేయనున్న ఈ టోర్నీలో 20జట్లు పాల్గొంటాయి. PAK మ్యాచులన్నీ లంకలో జరుగుతాయి. IND డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గతేడాది జరిగిన ఫైనల్లో RSAపై 7 రన్స్ తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే.

News November 25, 2025

పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?

image

తెల్లగా కనిపించే పాలిష్ రైస్ తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత B1 అందక బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్2 డయాబెటిస్ రావచ్చు. ఫైబర్ తక్కువగా ఉండడంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక కీళ్ల నొప్పులు వస్తాయి.

News November 25, 2025

CCRHలో 90 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH )లో 90 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. రీసెర్చ్ ఆఫీసర్, Jr లైబ్రేరియన్, MLT, LDC, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, B.Lisc, ఇంటర్, టెన్త్, BSc(నర్సింగ్), MSc, MS, MD, DMLT, MLT ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: ccrhindia.ayush.gov.in