News August 30, 2024

నేర స్థలాన్ని రక్షించడంలో రాజీపడలేదు: బెంగాల్ పోలీసులు

image

ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారం కేసులో నేర స్థ‌లాన్ని ర‌క్షించ‌డ‌ంలో రాజీప‌డ్డార‌ని సుప్రీంకోర్టులో సీబీఐ చేసిన ఆరోప‌ణ‌ల‌ను బెంగాల్ పోలీసులు కొట్టిపారేశారు. దీనికి సంబంధించి ఒక ఫొటో వైర‌ల్ అవ్వ‌డంపై స్పందించారు. ఘ‌ట‌న జ‌రిగిన అనంత‌రం బాధితురాలి మృత‌దేహం చుట్టూ ఉన్న‌వారంద‌రికీ అనుమ‌తి ఉంద‌ని, విచార‌ణ‌లో భాగ‌మైన వారినే అనుమ‌తించిన‌ట్టు కోల్‌క‌తా సెంట్ర‌ల్ DCP ఇందిరా వారి పేర్లతో సహా వెల్లడించారు.

Similar News

News September 18, 2025

3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

image

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.

News September 18, 2025

శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.

News September 18, 2025

ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 35 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/BE ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.177. SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.