News October 12, 2025

నీటి హక్కుల విషయంలో రాజీలేదు: ఉత్తమ్

image

TG: బనకచర్ల ప్రాజెక్ట్ DPR పరిశీలిస్తున్నామని కేంద్రం లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదన్న మాజీమంత్రి <<17976308>>హరీశ్<<>> రావు విమర్శలను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఖండించారు. ‘హరీశ్‌రావు అబద్ధాలు చెప్పి ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. నీటి హక్కుల విషయంలో రాజీపడేది లేదు. KCR హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. తుమ్మిడిహట్టికి DPR రూపొందించి బ్యారేజ్ నిర్మిస్తాం’ అని తెలిపారు.

Similar News

News October 12, 2025

ఎర్ర బెండ రకాల్లో ‘కాశీ లాలిమ’ ప్రత్యేకం

image

‘కాశీ లాలిమ’ ఎర్ర బెండను IIVR వారణాసి రూపొందించింది. ఈ కాయలు ఆకర్షణీయంగా ఉంటాయి. దీనికి కాయపుచ్చు పురుగు ముప్పు తక్కువ. దీని వల్ల పురుగు మందుల పిచికారీ అవసరం లేదు. చెట్టు పొట్టిగా ఉంటుంది. అందకే దగ్గర దగ్గరగా మొక్కలు నాటుకోవాలి. కాయపై దురద కలిగించే నూగు ఉండదు. అందుకే ఈ బెండ కాయలను సులభంగా కోయవచ్చు. పల్లాకు వైరస్ తెగులును ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ కాయల్లో జిగురు తక్కువగా ఉంటుంది.

News October 12, 2025

APPLY NOW: CBSLలో ఉద్యోగాలు

image

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్(CBSL)ముంబై కార్పొరేట్ ఆఫీస్‌లో ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్/ఆఫీస్ వర్క్) కోసం దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. పని అనుభవంగల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://www.canmoney.in/

News October 12, 2025

స్వీట్లు తినిపించి ముగ్గురు పిల్లల గొంతు కోసిన తండ్రి

image

ఇన్‌స్టా పరిచయం కుటుంబాన్ని నాశనం చేసింది. తమిళనాడుకు చెందిన వినోద్, నిత్యకు 12 ఏళ్ల క్రితం పెళ్లవ్వగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. వినోద్‌కు వ్యాపారంలో నష్టాలు రాగా అదే సమయంలో నిత్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడితో సంబంధం పెట్టుకుని భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఎంత బతిమాలినా రాకపోవడంతో తాగుడు బానిసైన వినోద్ నిన్న పిల్లలకు స్వీట్లు తినిపించి గొంతు కోసి చంపేశాడు.