News December 19, 2024
జగదీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు తిరస్కరణ

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు తిరస్కరణకు గురైంది. 14 రోజులకు ముందుగా నోటీసు ఇవ్వకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. తిరస్కరణపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీని అవమానించేందుకు బీజేపీ ఎంపీలకు ఎక్కువ అవకాశమిస్తున్నారని ప్రతిపక్షాలు కొన్ని రోజుల క్రితం రాజ్యసభ సెక్రటరీకి నోటీసు ఇవ్వడం తెలిసిందే.
Similar News
News November 26, 2025
2 కోట్ల ఆధార్ ఐడీల తొలగింపు.. కారణమిదే!

దేశవ్యాప్తంగా 2 కోట్ల ఆధార్ ఐడీలను UIDAI డీయాక్టివేట్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డేటా క్లీనింగ్‌లో భాగంగా చనిపోయిన వ్యక్తుల వివరాలను డిసేబుల్ చేసినట్లు చెప్పింది. ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఇలా చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, భారత రిజిస్ట్రార్ జనరల్ నుంచి వచ్చిన డెత్ రిజిస్ట్రేషన్లు, ఇతర సమాచారం ఆధారంగా డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది.
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్‌ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.


