News November 23, 2024
సీఎం పదవిపై గొడవలు లేవు: ఫడణవీస్
ముఖ్యమంత్రి పదవిపై కూటమిలో ఎలాంటి గొడవలు లేవని, ఈ విషయంలో కూటమి నేతలందరూ చర్చించుకొని నిర్ణయం తీసుకుంటామని దేవేంద్ర ఫడణవీస్ స్పష్టం చేశారు. సీఎం శిండే, ఫడణవీస్, అజిత్ ముగ్గురూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలు ప్రధాని మోదీకి మహారాష్ట్ర ఇస్తున్న మద్దతుకు నిదర్శనమని నేతలు పేర్కొన్నారు. ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటామన్న నినాదానికే ప్రజలు జైకొట్టారన్నారు.
Similar News
News November 23, 2024
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, CM దిగ్భ్రాంతి
AP: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు <<14688076>>ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య ఏడుకు చేరింది. గార్లదిన్నె మం. కలగాసుపల్లె వద్ద ఆర్టీసీ బస్సు 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఘటనాస్థలంలో ఇద్దరు, ఆస్పత్రిలో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
News November 23, 2024
కేంద్ర మంత్రి వర్గంలోకి శిండే?
మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం సాధించడంతో CM పీఠంపై ఉత్కంఠ నెలకొంది. కూటమిలో అత్యధికంగా 132 సీట్లలో ముందంజలో ఉన్న BJP CM పదవిని వదులుకోకపోవచ్చు. దీంతో ఏక్నాథ్ శిండే, అజిత్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో శిండేకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని BJP యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అజిత్ను మాత్రం Dy.CMగా కొనసాగించవచ్చని సమాచారం.
News November 23, 2024
ప్రియాంక గురించి ఇందిరా గాంధీ మాటల్లో
ప్రియాంకా గాంధీ గురించి ఇందిరా గాంధీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 1984లో తన హత్యకు 2 రోజుల ముందు సెక్రటరీతో ఇందిరా గాంధీ మాట్లాడుతూ ‘నేను ఎక్కువ రోజులు బతక్కపోవచ్చు. కానీ మీరు ప్రియాంక ఎదుగుదలను చూస్తారు. ప్రజలు ఆమెలో నన్ను చూసుకుంటారు. ఆమెను చూసినప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారు. ప్రియాంక ఎంతో సాధిస్తుంది. తరువాతి శతాబ్దం ఆమెదే. ప్రజలు నన్ను మరిచిపోతారు’ అని వ్యాఖ్యానించారు.