News November 9, 2024

సాగర్‌ డ్యామ్‌ వద్ద ఎలాంటి వివాదం జరగలేదు: ఏపీ ఇరిగేషన్ శాఖ

image

నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై AP, TG మధ్య ఎలాంటి <<14567529>>వివాదం<<>> జరగలేదని ఏపీ ఇరిగేషన్ ఎస్సీ కృష్ణమోహన్ స్పష్టం చేశారు. అధికారుల మధ్య జల వివాదం జరిగిందన్న వార్తలపై ఆయన స్పందించారు. అధికారులు పరస్పర సమన్వయంతో గేట్ల నిర్వహణను పరిశీలిస్తున్నారని చెప్పారు. కుడి కాలువ రీడింగ్ విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్‌తో ఇద్దరు ఉద్యోగుల మధ్య చిన్న వివాదం జరిగిందని, ఆ సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.

Similar News

News January 19, 2026

మా ఆట నిరాశపరిచింది: గిల్

image

న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో తాము ఆడిన విధానం నిరాశపరిచిందని భారత కెప్టెన్ గిల్ అన్నారు. ‘మేం కొన్ని విషయాలను సరిచేసుకోవాలి. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న తీరు మాకు సానుకూల అంశం. 8వ స్థానంలో వచ్చి హర్షిత్‌లా ఆడటం అంత సులభం కాదు. వచ్చే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని నితీశ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఎలాంటి కాంబినేషన్స్ పని చేస్తాయో చూడాలి’ అని <<18892634>>మ్యాచ్ అనంతరం<<>> చెప్పారు.

News January 19, 2026

UPI ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా.. ఎంత తీసుకోవచ్చంటే?

image

ఏప్రిల్ నుంచి UPI ద్వారా PF సొమ్మును సభ్యులు విత్ డ్రా చేసుకునేందుకు EPFO ఏర్పాట్లు చేస్తోంది. ట్రాన్సాక్షన్‌కు గరిష్ఠంగా రూ.25 వేలు వరకు తీసుకోవచ్చని తెలుస్తోంది. విత్ డ్రాకు అర్హత ఉన్న బ్యాలెన్స్, మినిమమ్ బ్యాలెన్స్‌(25%)ను విడిగా చూపిస్తుందని సమాచారం. దీనిపై EPFO, C-DAC, NPCI మధ్య చర్చలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా BHIM యాప్ ద్వారా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుందని చెప్పారు.

News January 19, 2026

నాన్న ఎదుట ఏడ్చేవాడిని: హర్షిత్ రాణా

image

తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ గురించి భారత క్రికెటర్ హర్షిత్ రాణా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘పదేళ్లపాటు నేను ఎంపిక కాలేదు. ట్రయల్స్‌కు వెళ్లడం, నా పేరు ఉండకపోవడం జరిగేది. ఇంటికొచ్చి నాన్న ఎదుట ఏడ్చే వాడిని. ఇప్పుడు ఆ వైఫల్యాలు పోయాయని భావిస్తున్నా. ఏం జరిగినా ఎదుర్కోగలను’ అని చెప్పారు. ఇప్పటిదాకా 14 వన్డేలు ఆడిన హర్షిత్ 26 వికెట్లు పడగొట్టారు. NZతో మూడో వన్డేలో 3 వికెట్లు తీశారు.