News April 11, 2025
గోశాలలో ఆవులు మృతి చెందలేదు: TTD

తిరుమల గోశాలలో వందల ఆవులు <<16061861>>మృతి చెందాయని <<>>జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కాదని తేల్చి చెప్పింది. దురుద్దేశంతో కొందరు మృతి చెందిన గోవుల ఫొటోలను పోస్ట్ చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడింది. భక్తులు ఇలాంటివి నమ్మవద్దని కోరింది.
Similar News
News November 20, 2025
HYD: బాధితులకు అండగా సైబర్ పోలీసులు

డబ్బు పోగొట్టుకున్న బాధితులకు సైబర్ క్రైం పోలీసులు అండగా నిలిచారు. ఫిర్యాదు స్వీకరించిన మరుక్షణం నుంచే స్పందించి సైబర్ నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి నుంచి రూ.63.23 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు 18 మంది నిందితులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు డీసీపీ సాయిశ్రీ తెలిపారు.
News November 20, 2025
ఏపీని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తాం: DGP

AP: 2026 మార్చి నాటికి రాష్ట్రంలో మావోయిజాన్ని అంతం చేస్తామని DGP హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. రంపచోడవరంలోని AOB ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే చేశారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. 50 మంది మావోలను అరెస్ట్ చేశామన్నారు. APని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తామని, ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
News November 20, 2025
విశ్వాన్ని నడిపించే అత్యున్నత శక్తి ‘విష్ణువు’

పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం|
దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా||
పవిత్రతకు మూలం, శుభాలకు ఆరంభం విష్ణుమూర్తియే. అతి పవిత్రమైన, అతి మంగళకరమైన ఆ దేవదేవుడను దేవతలే దైవంగా కొలిచి, ఆరాధిస్తారు. ఈ లోకంలోని సకల జీవులకు ఆయనే ఆశ్రయమిస్తాడని నమ్ముతారు. ఈ విశ్వాన్ని నడిపించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ప్రతి జీవికి ఆయనే స్థిరమైన ఆధారం. సరైన మార్గాన్ని చూపించే గురువు విష్ణు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


