News December 5, 2024
నో డేటా.. కేంద్రం తీరుపై విమర్శలు

డిజిటల్ యుగంలోనూ పలు అంశాలకు సంబంధించి తమ వద్ద డేటా లేదని కేంద్రం చెప్పడం విమర్శలకు దారితీస్తోంది. దేశంలో ప్రకృతి విపత్తుల వల్ల వాటిల్లిన నష్టం అంచనా, మెడికల్ ఇంటర్న్‌ల ఆత్మహత్యలు, విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు, పేపర్ లీకులపై వివరాల్లేవని పార్లమెంటుకు కేంద్రం తెలిపింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రం వైఖరి విస్మయానికి గురిచేస్తుందని విమర్శిస్తున్నాయి.
Similar News
News April 13, 2026
రాష్ట్రపతితో మంత్రి లోకేశ్ భేటీ

AP: కూటమి ఎంపీలతో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ప్రెసిడెంట్‌కు లోకేశ్ వివరించారు. అటు ఢిల్లీలో ఈనెల 30 నుంచి మే 10 వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ అధికారులకు మంత్రి సూచించారు.
News April 13, 2026
మోనాలిసా కేసు.. భర్తకు హైకోర్టులో ఊరట

కుంభమేళా బ్యూటీ మోనాలిసా కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. మైనరైన ఆమెను కిడ్నాప్ చేశారంటూ నమోదైన కేసులో భర్త ఫర్మాన్ ఖాన్‌కు కేరళ హైకోర్టు ఊరటనిచ్చింది. మే 20 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. కాగా మోనాలిసా మైనర్ అని NCST నిర్ధారించడంతో భర్తపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు కొన్ని రోజులుగా మోనాలిసా కనిపించట్లేదని భర్త నిన్న <<19631395>>సెల్ఫీ వీడియో<<>> రిలీజ్ చేశారు.
News April 13, 2026
పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్స్.. ఈసీ, కేంద్రానికి SC నోటీసులు

ఎన్నికల నిర్వహణపై ఈసీ, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ పెట్టాలంటూ BJP నేత అశ్విని కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చింది. అమలుపై తమ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. అయితే ఇప్పటికిప్పుడు ఈ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని, భవిష్యత్తులో అమలుకు వ్యవస్థలన్నీ కలిసి పనిచేయాలని SC పేర్కొంది.


