News November 29, 2024
OTP డెలివరీల్లో ఆలస్యం ఉండదు: ట్రాయ్

నెట్ బ్యాంకింగ్, ఆధార్ OTPల డెలివరీల్లో December 1 నుంచి ఆలస్యం కానున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని TRAI ఖండించింది. OTPలు ఎప్పటిలాగే సత్వరమే అందుతాయని తెలిపింది. ఫేక్ కాల్స్, ఫ్రాడ్ మెసేజ్లను అరికట్టేందుకు మెసేజ్ ట్రేస్బిటిలీ వ్యవస్థను తీసుకొచ్చామని, దీని ప్రభావం OTP డెలివరీలపై పడదని పేర్కొంది. సైబర్ మోసాలను అడ్డుకునేందుకు OTPలను సమీక్షించాలని టెలికం సంస్థలను TRAI ఆదేశించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 23, 2025
ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారు కానీ ఆధారాలు లేవు: ప్రశాంత్ కిషోర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంపై జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే అనుమానం ఉందని, కానీ దానికి ఆధారాలు లేవని తెలిపారు. గ్రౌండ్ ఫీడ్బ్యాక్కు భిన్నంగా ఫలితాలు ఉన్నాయని, ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని అన్నారు. కాగా 243 స్థానాలున్న బిహార్లో 238 చోట్ల పోటీ చేసినా JSP ఒక్క సీటు కూడా గెలవలేదు. ఓటు శాతం 2-3%కే పరిమితమైంది.
News November 23, 2025
చెమటోడ్చుతున్న భారత బౌలర్లు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు. రెండో రోజూ ఆట తొలి సెషన్లో వికెట్లేమీ తీయలేదు. అర్ధసెంచరీ చేసిన ముత్తుస్వామి(56*), కైల్(38*) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఏడో వికెట్కు 70 పరుగులు జోడించారు. టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు తొలి ఇన్నింగ్సులో 316/6.
News November 23, 2025
రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు: ఐబొమ్మ రవి తండ్రి

<<18323509>>ఎన్కౌంటర్<<>> చేయాలన్న నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలను ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు తప్పు బట్టారు. ‘ఆయనను ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశా. ఇప్పుడు రేట్లు పెరిగాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు. నా కొడుకు తరఫున వాదించే న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేస్తా’ అని చెప్పారు.


