News December 7, 2024

కేసీఆర్‌తో ఎలాంటి చర్చ జరగలేదు: మంత్రి పొన్నం

image

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించే క్రమంలో ఆయనతో ఎలాంటి చర్చ జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రతిపక్ష నేత కావడంతో ప్రొటోకాల్ ప్రకారం ఆయనను ప్రభుత్వం తరఫున మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. గులాబీ బాస్ కోరిక మేరకు లంచ్ చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు గవర్నర్‌ను కూడా ఆహ్వానించినట్లు వెల్లడించారు.

Similar News

News January 21, 2026

సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ అసిస్టెంట్, వాచ్‌మెన్, సబ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ(BSW/BA/BCOM),టెన్త్, 7వ తరగతి అర్హత కలిగినవారు అర్హులు. వయసు 22 -40 ఏళ్ల మధ్య కలిగి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://centralbank.bank.in/

News January 21, 2026

శబరిమల ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే?

image

శబరిమలలో 2నెలలు కొనసాగిన మండల-మకరవిలక్కు ముగియడంతో ఆలయాన్ని అధికారులు మూసేశారు. మళ్లీ ఫిబ్రవరిలో జరగబోయే నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఆలయాన్ని FEB 12 సా.5 గంటలకు తెరుస్తారు. పూజలు 17వ తేదీ రా.10గం.కు వరకు కొనసాగుతాయి. అప్పుడూ భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. గతంలో మాదిరే ఆన్‌లైన్ బుకింగ్, దర్శన టోకెన్లు కొనసాగుతాయి.

News January 21, 2026

దావోస్‌లో సీఎం రేవంత్, చిరంజీవి

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో తెలంగాణ విజన్‌ను ప్రదర్శించగా.. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్, చిరంజీవి, మంత్రులు పక్కపక్కనే కూర్చున్నారు. ఆప్యాయంగా మాట్లాడుకుని కలిసి విందులో పాల్గొన్నారు. అయితే గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు పాల్గొనే ఈ ప్రోగ్రాంకు మెగాస్టార్ ఎందుకు వెళ్లారనే దానిపై క్లారిటీ రాలేదు.