News August 7, 2024

అనర్హత వేటు.. తొలిసారి స్పందించిన వినేశ్ ఫొగట్

image

పారిస్ ఒలింపిక్స్‌లో తనపై అనర్హత వేటు పడటంపై భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ తొలిసారి స్పందించారు. ‘ఇది చాలా బాధాకరం. మనం మెడల్ పోగొట్టుకున్నాం. కానీ ఇది ఆటలో భాగం’ అని తనను కలిసిన భారత రెజ్లింగ్ కోచ్ వీరేందర్ దహియా, ఇతర సిబ్బందితో వినేశ్ అన్నారు. అటు వినేశ్ ఫొగట్‌పై వేటు పడటంతో తామంతా షాక్‌కు గురైనట్లు వీరేందర్ దహియా పేర్కొన్నారు. కాగా అస్వస్థతకు గురైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు.

Similar News

News April 7, 2026

యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్

image

యువతలోని నూతన ఆలోచనలకు పదును పెట్టి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈనెల 11న నల్గొండ ఐటీ టవర్స్‌లో ‘ఇన్నోవేషన్ పంచాయతీ’ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమ గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. అంకుర సంస్థల స్థాపన, సాంకేతిక సవాళ్లు, వ్యాపార విస్తరణపై నిపుణులు నేరుగా సలహాలిస్తారని అయన తెలిపారు.

News April 7, 2026

PHOTOS: KKRvsPBKS మ్యాచ్

image

ఐపీఎల్-2026లో భాగంగా KKR, PBKS మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో అభిమానులు దాదాపు 4-5 గంటలు వేచిచూశారు. చివరికి వర్షం తగ్గినా నీరు బాగా నిలిచి ఉండటంతో మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. KKR ఓనర్ షారుక్ ఖాన్, ఆయన కూతురు సుహానా ఖాన్, బెంగాల్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ గంగూలీ, గాయంతో టోర్నీకి దూరమైన హర్షిత్ రానా తదితరులు కూడా స్టేడియానికి వచ్చారు.

News April 7, 2026

నేటి ముఖ్యాంశాలు

image

* కాంగ్రెస్ పాకిస్థాన్ పాట పాడుతోంది: ప్రధాని మోదీ
* AP రాజధానిగా అమరావతి.. గెజిట్ రిలీజ్
* AP: పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్ తగ్గింపు
* త్వరలో తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ప్రారంభం: CM రేవంత్
* TN లాకప్ డెత్ కేసు.. 9మంది పోలీసులకు మరణ శిక్ష
* బాసర ఆలయ పున:నిర్మాణానికి సీఎం భూమిపూజ
* CEC జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల అభిశంసన నోటీసును తిరస్కరించిన రాజ్యసభ
* IPL: KKR, PBKS మ్యాచ్ రద్దు