News March 1, 2025
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

AP: రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఉ.9 – మ.12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 10.58 లక్షల మంది పరీక్షలు రాయనుండగా నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాలను ‘నో మొబైల్’ జోన్గా ప్రకటించారు. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకొని ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ రాయాలని విద్యార్థులకు Way2News సూచిస్తోంది. ALL THE BEST.
Similar News
News March 1, 2025
‘రాణి రుద్రమదేవి ఎయిర్ పోర్ట్’ అని పేరు పెట్టాలని డిమాండ్లు

TG: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఓరుగల్లు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ‘రాణి రుద్రమదేవి ఎయిర్ పోర్టు’ అని పేరు పెట్టాలని కోరుతున్నారు. వరంగల్ గడ్డ అంటేనే కాకతీయులు అని, వారి పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆ పేరుతో క్రియేట్ చేసిన ఏఐ ఫొటో ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ లోగా విమానాలు నడిపించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
News March 1, 2025
ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం, లోకేశ్

AP: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పిల్లలందరూ ధైర్యంగా ఉండాలని, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని Xలో పోస్ట్ చేశారు. వేసవికాలం కావడంతో డీహైడ్రేట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. ప్రయత్నం సరిగ్గా చేస్తే తప్పకుండా విజయం లభిస్తుందని ట్వీట్ చేశారు.
News March 1, 2025
కులగణన రీసర్వే పూర్తి.. కేసీఆర్, హరీశ్ దూరం

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండోవిడత కులగణన సర్వే నిన్నటితో పూర్తయింది. 18,539కుటుంబాలు సర్వేలో వివరాలు సమర్పించాయి. 3లక్షల56వేలకు పైగా కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉండగా కేవలం 5.21శాతం ఫ్యామిలీల సమాచారం మాత్రమే నమోదైంది. దీంతో ఇప్పటివరకూ మెుత్తంగా 1.12కోట్లకు పైగా కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. కేసీఆర్, హరీశ్రావు కుటుంబసభ్యులు సర్వేకు దూరంగా ఉన్నారు.