News March 26, 2024
పెళ్లి చేసుకుంటే నో ఎంట్రీ!

TG: డిగ్రీ విద్యార్థినులకు వసతి కష్టాలు వచ్చి పడ్డాయి. వివాహమైన వారికి గురుకులాల్లో అనధికారికరంగా ప్రవేశాలు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. డిగ్రీ మధ్యలోనే పెళ్లైనా వసతి గృహంలో ఉండేందుకు అనుమతించట్లేదని సమాచారం. దీనిపై ప్రిన్సిపల్, ఆర్‌సీఓలకు ఫిర్యాదు చేసినా పర్మిషన్ లభించట్లేదట. మరోవైపు అనుమతులపై ప్రిన్సిపల్, RCOలు నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు గురుకుల సొసైటీ వర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News April 20, 2025
జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం

TG: జపాన్ పర్యటనలో భాగంగా పలు సంస్థలతో CM రేవంత్ బృందం పలు ఒప్పందాలు చేసుకుంది. HYDలో ఎకో టౌన్ ఏర్పాటులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ9 LLC, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో MOU చేసుకుంది. వీటితో HYDలో భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తామని CM విశ్వాసం వ్యక్తపరిచారు.
News April 20, 2025
విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు: కేశినేని చిన్ని

AP: మహిళా ప్రపంచకప్ క్రికెట్ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ మూలపాడులో జర్నలిస్టుల క్రికెట్ పోటీల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు జై షా అంగీకరించినట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
News April 20, 2025
రోహిత్ రికార్డును సమం చేసిన కోహ్లీ

ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్న భారత ప్లేయర్‌గా రోహిత్ రికార్డును కోహ్లీ సమం చేశారు. ఇవాళ పంజాబ్‌తో మ్యాచులో అర్ధసెంచరీతో అదరగొట్టిన కోహ్లీ 19వ POTM అందుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో ధోనీ(18 POTM) ఉన్నారు. ఓవరాల్‌గా ఈ మెగా టోర్నీలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్‌గా డివిలియర్స్(25) తొలి స్థానంలో ఉన్నారు.