News August 30, 2024
గర్ల్స్ హాస్టల్లో ఎలాంటి పరికరాలు లభించలేదు: CM

AP: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై సీఎం చంద్రబాబు మీడియాతో చిట్చాట్లో కీలక విషయాలు వెల్లడించారు. సకాలంలో స్పందించి అధికారులను అప్రమత్తం చేశామని, హాస్టల్ మొత్తం తనిఖీ చేసినా ఇప్పటివరకు ఎలాంటి పరికరాలు దొరకలేదని చెప్పారు. అయినా దర్యాప్తు ఆపకుండా సమగ్ర విచారణ కొనసాగుతుందన్నారు. కొన్ని ప్రచారాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టబోమని సీఎం హెచ్చరించారు.
Similar News
News November 21, 2025
విశాఖ: ప్రేమ.. పెళ్లి.. ఓ తమిళబ్బాయ్..!

విశాఖలో ఒక అమ్మాయి కోసం ఇద్దరు యువకుల ఘర్షణ పడగా ఒకరికి గాయాలయ్యాయి. ఓ హోటల్లో పనిచేస్తున్న అమ్మాయి మొదట ఒక తెలుగు యువకుడ్ని ప్రేమించింది. తర్వాత మరో తమిళ యువకుడిని పెళ్లి చేసుకోవడానికి రెఢీ అయ్యింది. దీంతో ఆ ఇద్దరి యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తెలుగు యువకుడు, తమిళ యువకుడుపై కత్తితో దాడి చేసినట్లు అమ్మాయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో త్రీటౌన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
News November 21, 2025
DoPTకి లేఖ రాసిన ACB

ఫార్ములా eరేస్ కేసు దర్యాప్తులో ACB స్పీడ్ పెంచింది. కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేయడానికి DoPT (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) అనుమతి కోరింది. కేంద్ర సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అరవింద్ను విచారించి ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయనుంది. IASలను విచారించాలంటే DoPT పర్మిషన్ ఉండాలి. అటు A1 KTRను విచారించేందుకు గవర్నర్ ఇప్పటికే అనుమతించడం తెలిసిందే.
News November 21, 2025
నీటి నిల్వ, సంరక్షణ చర్యలను మెచ్చిన కేంద్రం

AP: రాష్ట్రవ్యాప్తంగా డి.సీఎం పవన్ నేతృత్వంలో నీటి నిల్వ, సంరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రం గుర్తించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖకు జల్ శక్తి అవార్డులు వరించాయి. పంచాయతీ క్యాటగిరీలో ప్రథమ స్థానంలో మదనపల్లి మండలం, దుబ్బిగానిపల్లె, ద్వితీయ స్థానంలో ప్రకాశం(జి), పీసీ పల్లె(మం) మురుగమ్మి గ్రామం, జల్ సంచయ్-జన్ భాగీదారీలో దక్షిణ జోన్లో నెల్లూరు జిల్లాకు అవార్డు దక్కింది.


