News April 10, 2024
ఇజ్రాయెల్ మారణహోమానికి రుజువుల్లేవు: అమెరికా
గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందనడానికి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని అమెరికా సెనేట్ సాయుధ బలగాల కమిటీకి ఆ దేశ రక్షణ మంత్రి ఆస్టిన్ తెలిపారు. గత అక్టోబరు నుంచి హమాస్ ఉగ్రసంస్థపై ఇజ్రాయెల్ గాజాలో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి పౌరులపైనా ఇజ్రాయెల్ మారణహోమం చేస్తోందంటూ పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దానిపై తమ వద్ద ఆధారాల్లేవని అమెరికా తాజాగా తేల్చిచెప్పింది.
Similar News
News November 15, 2024
INDvsSA: సాధిస్తారా? సమం చేస్తారా?
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య చివరిదైన 4వ టీ20 జరగనుంది. ఈరోజు రాత్రి 8.30గంటలకు జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది. జరిగిన 3 టీ20ల్లో 2 గెలిచిన భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఆతిథ్య సఫారీ జట్టేమో ఇందులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది.
> ALL THE BEST INDIA
News November 15, 2024
నేడు బడ్జెట్‌పై చర్చ
AP: మొన్న ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ సమాధానం ఇస్తారు. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ బిల్లు, ఏపీ ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు.
News November 15, 2024
ఆటిజంపై స్పెషల్ ఫోకస్: మంత్రి సత్యకుమార్
AP: రాష్ట్రంలో ఆటిజం లక్షణాలున్న పిల్లలను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ వెల్లడించారు. మొదటి రెండేళ్లలో లక్షణాలను గుర్తిస్తే దీన్ని నివారించగలమని అసెంబ్లీలో అన్నారు. దీనిపై ఇతర రాష్ట్రాల్లో పాటిస్తున్న తీరును పరిశీలిస్తామని తెలిపారు. ఆటిజం చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేర్చేందుకు యత్నిస్తున్నామన్నారు.