News January 5, 2025
ఆ భూములకు నో రైతుభరోసా.. మీరేమంటారు?

TG: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలామంది గుట్టుచప్పుడు కాకుండా సాగు చేయని భూమికీ రైతుబంధు తీసుకున్నారు. ఇకపై రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లు, మైనింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాలా కన్వర్షన్ అయిన భూములు, పరిశ్రమల భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతుభరోసా ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా తేల్చి చెప్పారు. దీంతో చాలామందికి నోట్లో వెలక్కాయ పడ్డట్లయింది. మరి CM నిర్ణయంపై మీరేమంటారు?
Similar News
News February 1, 2026
APPLY NOW: NALCOలో ఉద్యోగాలు

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<
News February 1, 2026
డాన్సర్స్, ఫ్యామిలీలకు రామ్‌చరణ్ బంపర్ ఆఫర్

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్‌కు చెందిన దాదాపు 500 మంది మెంబర్స్, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌కు ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారని తెలుస్తోంది. దీని కోసం ఆయన రూ.50లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన మాటను రామ్‌చరణ్ నిలబెట్టుకున్నారని అభిమానులు చెబుతున్నారు. SMలో చెర్రీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
News February 1, 2026
పశువులకు పోషకాలను అందించే అవిశ

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.


