News October 10, 2025
లడ్డూ ప్రసాదాల బాక్సులపై దేవుడి ముద్రలు వద్దు: నెటిజన్లు

దైవ దర్శనాలకు వెళ్లి తిరిగివచ్చిన భక్తులను ఓ సమస్య వెంటాడుతోంది. ప్రముఖ దేవాలయాల లడ్డూ ప్రసాదాల బాక్సులపై దేవుడి బొమ్మలు, ఆలయ గోపురాలు ముద్రించడమే దీనికి కారణం. లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాక ఖాళీ బాక్సులు, కవర్లను చెత్తలో ఎలా పారేస్తామని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అందుకే దేవాలయం, దేవుడి బొమ్మలకు బదులు ఆలయ పేరు లేదా లోగోను ముద్రించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News October 10, 2025
కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీం తీర్పు రిజర్వ్

కరూర్ తొక్కిసలాటపై SIT ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ TVK దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. TN పోలీసు అధికారులతోనే SIT ఏర్పాటు చేయాలనే HC తీర్పును వ్యతిరేకించింది. ఆపై జడ్జిలు జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ అంజరియాతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కరూర్‌లో TVK విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
News October 10, 2025
బిహార్‌లో రేపు NDA కూటమి సమావేశం

త్వరలో బిహార్‌లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో NDA కూటమి రేపు అక్కడ కీలక సమావేశం నిర్వహించనుంది. JDU, BJPతో పాటు కూటమిలోని ఇతర పార్టీల సీట్ల పంపకాలపై ఇందులో చర్చించనున్నారు. మొత్తం 243 సీట్లలో జేడీయూ, బీజేపీ 205 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏయే స్థానాల్లో ఎవరెవరు బరిలో దిగాలనే అంశంపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా తొలి విడత ఎన్నికలకు ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
News October 10, 2025
గర్భిణులు, తల్లులకు అలర్ట్!

గర్భధారణ నుంచి రెండేళ్ల వరకు తల్లులకు, పిల్లల మొదటి 1,000 రోజుల్లో వారికి అదనంగా చక్కెర అందించొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ‘తక్కువ చక్కెర తీసుకునే చిన్నారులలో జ్ఞాపకశక్తి& ఏకాగ్రత మెరుగ్గా ఉంటాయి. పెద్దయ్యాక షుగర్, BP ప్రమాదం తగ్గుతుంది. తల్లి తీసుకునే పోషకాహారం బిడ్డ భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్మిస్తుంది’ అని పేర్కొంటున్నారు.
* ప్రతిరోజూ మహిళల కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>>పై క్లిక్ చేయండి