News May 20, 2024

మేడిగడ్డ నిలబడుతుందనే గ్యారంటీ లేదు: మంత్రి

image

TG: మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసినా నిలబడుతుందనే గ్యారంటీ లేదని NDSA కమిటీ చెప్పిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులపై నిపుణుల కమిటీ ఏం చెప్తే అది చేస్తామన్నారు. సాంకేతిక కమిటీ సూచనలకు విరుద్ధంగా పనిచేసి ప్రజాధనం వృథా చేయదలుచుకోలేదని చెప్పారు. తాత్కాలికంగా రైతులకు నీరు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు.

Similar News

News September 17, 2025

బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్‌ ఎంత నష్టపోయేది?

image

ఆసియా కప్‌లో భాగంగా UAEతో మ్యాచ్‌ను ఒకవేళ పాకిస్థాన్ బాయ్‌కాట్ చేసి ఉంటే ఆర్థికంగా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దేశ క్రికెట్ బోర్డు సుమారు ₹145కోట్ల ఆదాయం కోల్పోయేది. ఇక మ్యాచ్‌ను ఉద్దేశపూర్వకంగా బాయ్‌కాట్ చేసినందుకు క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద సుమారు రూ.140కోట్లు ICCకి చెల్లించాల్సి ఉండేదని విశ్లేషకులు అంచనా వేశారు. అంటే మొత్తంగా రూ.285కోట్ల భారం మోయాల్సి వచ్చేదన్నమాట.

News September 17, 2025

BlackBuck సంస్థకు మంత్రి లోకేశ్ ఆహ్వానం

image

AP: బెంగళూరు నుంచి తమ ఆఫీసును తరలించాలని అనుకుంటున్నట్లు BlackBuck సంస్థ CEO రాజేశ్ పెట్టిన పోస్టుకు మంత్రి లోకేశ్ స్పందించారు. ఆ కంపెనీని వైజాగ్‌కు రీలొకేట్ చేసుకోవాలని కోరారు. ఇండియాలో టాప్-5 క్లీనెస్ట్ సిటీల్లో వైజాగ్ ఒకటని పేర్కొన్నారు. ‘ఆఫీసుకి వచ్చి వెళ్లేందుకు 3hr+ పడుతోంది. 9 ఏళ్లుగా ORR ఆఫీస్+ఇల్లుగా మారింది. ఇక ఇక్కడ ఉండలేం. రోడ్లు గుంతలు, దుమ్ముతో నిండిపోయాయి’ అని రాజేశ్ పేర్కొన్నారు.

News September 17, 2025

OG టికెట్ ధరలు భారీగా పెంపు

image

పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోకు అనుమతిస్తూ టికెట్ ధరను రూ.1000గా పేర్కొంది. అంతేకాకుండా అక్టోబర్ నాలుగు వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్ఠంగా రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని తెలిపింది. మరోవైపు తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.