News August 15, 2025

శనివారం వరకు వేటకు వెళ్లరాదు: APSDMA

image

AP: బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అటు కృష్ణానది వరద ప్రవాహం ఎగువ ప్రాజెక్టులలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని వివరించింది.

Similar News

News August 15, 2025

టీమిండియా రైజింగ్ స్టార్ ఎవరో చెప్పిన రవిశాస్త్రి

image

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇండియన్ క్రికెట్‌లో రైజింగ్ స్టార్ ఎవరో చెప్పారు. ‘నేను శుభ్‌మన్ గిల్‌ని టీమిండియా రైజింగ్ స్టార్‌గా భావిస్తున్నాను. కేవలం 25 ఏళ్లలోనే అతను ఎంతో గుర్తింపు సాధించారు. ఇంకా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ఇంగ్లండ్‌లో అతను ఎలాంటి సిరీస్‌ని ఎదుర్కొన్నారో అంతా చూశాం. అతను చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌. సుదీర్ఘ ఇన్నింగ్సులు ఆడగల సత్తా అతనికి ఉంది’ అని పేర్కొన్నారు.

News August 15, 2025

ఆగస్టు 15: చరిత్రలో ఈ రోజు

image

1769: ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ జననం
1872: యోగి, జాతీయవాది శ్రీ అరబిందో(ఫొటోలో) జననం
1945: నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహరావు జననం
1947: భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం
1961: సినీ నటి సుహాసిని జననం
1964: సినీ నటుడు శ్రీహరి జననం
1971: బహ్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం
1975: భారత మాజీ క్రికెటర్ విజయ్ భరద్వాజ్ జననం
2018: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ మరణం

News August 15, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.