News February 20, 2025
విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు: ERC

AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని విద్యుత్ నియంత్రణ మండలి(ERC) ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ ప్రకటించారు. 2025-26 ఏడాదికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఛార్జీల టారిఫ్‌లను విడుదల చేసిన ఆయన, ఏ విభాగంలోనూ ఛార్జీల పెంపు లేదని స్పష్టం చేశారు. వచ్చే నెల 31లోపు టారిఫ్‌లు విడుదల చేయాల్సి ఉండగా, ముందుగానే ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు.
Similar News
News February 21, 2025
ఇక నుంచి ఏపీ నీటిని తీసుకోవద్దు.. KRMBకి తెలంగాణ లేఖ

TG: శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఏపీ నీరు తీసుకోకుండా వెంటనే ఆపాలని KRMBకి తెలంగాణ ప్రభుత్వ అధికారులు లేఖ సమర్పించారు. ఏపీ ఇప్పటికే వాటాకు మించి నీటిని వాడుకుందన్నారు. ఉమ్మడి జలాశయాల నుంచి ఏపీ ఇక నీటిని తీసుకోరాదని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. మే నెల వరకు తెలంగాణకు 107 టీఎంసీలు ఇవ్వాలని ఇండెంట్ ఇచ్చారు.
News February 21, 2025
రామరాజ్య స్థాపన పేరిట ఫండ్స్ వసూలు!

చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు <<15493380>>రంగరాజన్<<>>పై దాడి చేసి అరెస్టైన వీరరాఘవరెడ్డి 3 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. నిందితుడు తెలుగు రాష్ట్రాల్లోని 6 ప్రధాన ఆలయాలకు వెళ్లి రామరాజ్య స్థాపన పేరిట ఫండ్స్ వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అతని బ్యాంక్ అకౌంట్లో రూ.20వేలే ఉన్నట్లు, అరెస్టుకు ముందు నగదు మొత్తాన్ని డ్రా చేసినట్లు అనుమానిస్తున్నారు. విచారణ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు.
News February 21, 2025
ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ ఓయో’

ఎక్స్‌లో ‘బాయ్‌కాట్ ఓయో’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. కుంభమేళా సందర్భంగా ఓయో సంస్థ ఇచ్చిన ఓ ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులో ‘దేవుడు అన్ని చోట్లా ఉంటాడు.. అలాగే ఓయో కూడా’ అని పేర్కొనడమే ఇందుకు కారణం. దేవుడితో పోల్చడమేంటని ఓయో యాజమాన్యంపై నెటిజన్లు, హిందూ సంఘాల ప్రతినిధులు విరుచుకుపడుతున్నారు. ఓయోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.