News October 10, 2025
లివ్-ఇన్ రిలేషన్‌షిప్ వద్దు.. 50 ముక్కలవుతారు: గవర్నర్

నేటి తరం అమ్మాయిలు లివ్-ఇన్ రిలేషన్‌షిప్ (సహజీవనం)కు దూరంగా ఉండాలని ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పిలుపునిచ్చారు. ‘లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్ ఈ రోజుల్లో ట్రెండ్‌గా మారింది. 15-20 ఏళ్ల యువతులు బిడ్డలను కంటున్నారు. మన ఆడబిడ్డలు ఇలా చేయడం బాధగా ఉంది. సహజీవనానికి దూరంగా ఉండండి. లేకపోతే మీరు 50 ముక్కలై దొరుకుతారు. వాటికి దూరంగా ఉండాలి’ అని వారణాసిలో స్నాతకోత్సవ సభలో హెచ్చరించారు.
Similar News
News October 10, 2025
మరియాకు నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌కు నిరాశ

2025కి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోను వరించింది. డెమొక్రటిక్ రైట్స్, శాంతి కోసం ఆమె చేసిన కృషిని గుర్తించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. వెనిజులాను ఆమె డిక్టేటర్‌షిప్ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించారు. అటు ఈ ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నిరాశే మిగిలింది.
News October 10, 2025
ఐటీ క్యాపిటల్‌గా విశాఖ.. పెట్టుబడుల వెల్లువ

దిగ్గజ టెక్ సంస్థల నుంచి వైజాగ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్ అనుబంధ Raiden Infotech ₹87,520cr ఇన్వెస్ట్ చేయనుంది. ఇది దేశంలోనే హయ్యెస్ట్ FDI. దీనితోపాటు TCS, సిఫీ కూడా తమ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. అదానీ సంస్థ టెక్ పార్క్ (₹21,844 కోట్లు), మెటా అండర్‌సీ ప్రాజెక్టులు రానున్నాయి. ఈ టెక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో డిజిటల్ ఇన్‌ఫ్రా మెరుగవ్వడంతోపాటు యువతకు వేలాది జాబ్స్ దక్కనున్నాయి.
News October 10, 2025
ఈ ప్లేయర్లను రిలీజ్ చేయనున్న CSK!

IPL-2026కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పలువురు ప్లేయర్లను <<17966400>>రిలీజ్<<>> చేయవచ్చని Cricbuzz తెలిపింది. దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, సామ్ కరన్, కాన్వేలను వదులుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇప్పటికే అశ్విన్ రిటైర్ కావడంతో చెన్నై పర్సులో రూ.9.75 కోట్లు యాడ్ అయ్యాయి. అటు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సహా శ్రీలంక స్పిన్నర్లు హసరంగ, మహీశ్ తీక్షణలను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.