News May 11, 2024
ఎంత కష్టమైనా పోలింగ్ బూతుకెళ్లి ఓటేయండి: హీరో నిఖిల్

ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రికార్డు ఓటింగ్ పర్సంటేజ్ నమోదుకావాలని హీరో నిఖిల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని గ్రామాలకు వెళ్లే అన్ని రోడ్లు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ఎంత కష్టమైనా సరే మీ పోలింగ్ బూతుకి చేరుకొని ఓటేసి మీ స్వరాన్ని వినిపించాలని అభ్యర్థిస్తున్నా. ఓటింగ్ శాతంలో రికార్డులు నమోదవ్వాలి’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
Similar News
News January 1, 2026
ఆనందంగా జీవించాలంటే ఇవి చాలు

జీవితంలో అశాంతికి కారణం పోలికే అంటున్నారు మానసిక నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే మీకేం కావాలో ముందు తెలుసుకోవాలి. అసలైన సంపద ఆరోగ్యం, అవసరాలు తీర్చేంత బ్యాంక్ బ్యాలెన్స్, అర్థం చేసుకొనే భాగస్వామి, గాలి కబుర్లు, చెప్పుడు మాటలు చెప్పేవారిని దూరం పెట్టండి, రోజూ ఆత్మపరిశీలన చేసుకుంటే సరిపోతుంది. ప్రతికూల ఆలోచనలు చేయకండి. ఇతరులతో పోల్చుకోవడం మానేయండి.
News January 1, 2026
విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

AP: న్యూఇయర్ వేళ నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. తుడుములదిన్నె గ్రామంలో ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి(4), సూర్యగగన్(2)కు విషమిచ్చి సురేందర్(35) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలను పెంచే స్తోమత లేక సురేంద్ర ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. గతేడాది సురేంద్ర భార్య మహేశ్వరి(32) అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.
News January 1, 2026
పండగకు, జాతరకు స్పెషల్ బస్సులు.. ఛార్జీల పెంపు!

TG: సంక్రాంతికి, మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా RTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సంక్రాంతికి HYD నుంచి ఈ నెల 9-13 వరకు 6,431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అటు మేడారం జాతరకు ఈ నెల 25 నుంచి హైదరాబాద్ నుంచే 3,495 స్పెషల్ బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ టికెట్ ఛార్జీలు, ప్రత్యేక బస్సుల్లో 50% మేర పెంపు ఉంటాయన్నారు.


