News October 6, 2024
ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదు: CM

TG: ఎవరు అడ్డుపడినా మూసీ నది ప్రక్షాళన ఆగదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మూసీ ప్రక్షాళనకు అడ్డుతగులుతున్న BJP MP ఈటల రాజేందర్ కూడా BRS నేతల అడుగుజాడల్లోనే నడుస్తున్నారని సీఎం విమర్శించారు. మూసీ పరీవాహకంలో ఉంటున్న పేదల జీవితాలు బాగుపడవద్దా? అని ప్రశ్నించారు. నిర్వాసితులు అవుతారని ఆలోచిస్తే ప్రాజెక్టులు ఎలా సాధ్యమవుతాయన్నారు.
Similar News
News November 22, 2025
గుడిలో దండలు మార్చుకుని.. IASల ఆదర్శ వివాహం

AP: పెళ్లంటే ఆర్భాటం కాదు అర్థం చేసుకోవడమేనని నిరూపించారు ఇద్దరు ఐఏఎస్లు. విశాఖ కైలాసగిరి శివాలయంలో నిరాడంబరంగా దండలు మార్చుకుని, తర్వాత సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో సంతకాలు చేసి దంపతులయ్యారు. అల్లూరి జిల్లా పాడేరు ITDA ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీపూజ, మేఘాలయలోని దాదెంగ్రి జాయింట్ కలెక్టర్ ఆదిత్య వర్మల వివాహ తంతు ఇలా సింపుల్గా పూర్తయ్యింది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం విశేషం.
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలి?

భార్యాభర్తల్లో ఎవరైనా ఈ వ్రతం చేయవచ్చు. మొదటి వారం శ్రీనివాసుడి చిత్రపటం/విగ్రహాన్ని అలంకరించి, వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చెప్పాలి. కోరిన కోర్కెలు నెరవేరితే 7 కొండలు ఎక్కుతామని ముడుపు కట్టాలి. 7 వారాల పాటు 7 వత్తుల దీపం వెలిగించాలి. పూజ ఎలాగైనా చేయవచ్చు. శనివారాల్లో మద్యమాంసాల్ని ముట్టుకోకూడదు. చివరి వారం వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి. వీలున్నప్పుడు తిరుపతి వెళ్లి ముడుపు సమర్పించాలి.
News November 22, 2025
దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు!

దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాలాలను బట్టి ఎండ, వానలు, చలి అన్నీ ఎక్కువగానే ఉంటున్నాయి. ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య 273 రోజుల్లో 270 రోజులు తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. ఈ ప్రభావంతో దేశంలో 4 వేల మందికి పైగా చనిపోయారని, 2.34 కోట్ల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని పేర్కొంది.


