News June 13, 2024

G7లో సభ్యత్వం లేకున్నా.. మోదీకి ఆహ్వానం

image

ధనిక దేశాల కూటమి ‘G7’లో సభ్యత్వం లేకున్నా ప్రధాని మోదీ సదస్సులో పాల్గొంటున్నారు. జూన్ 13-15 మధ్య జరిగే ఈ సదస్సు కోసం ఇప్పటికే ఇటలీ వెళ్లారు. దీనికి ఆతిథ్యం ఇస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు మోదీ ఇందులో పాల్గొంటున్నారు. తాజా సదస్సులో గాజా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించనున్నారు. కాగా ‘G7’లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, USA సభ్య దేశాలుగా ఉన్నాయి.

Similar News

News October 21, 2025

అవతరించడం, అంతరించడం ప్రకృతి ధర్మం

image

ఈ సమస్త చరాచరసృష్టి ఈశ్వరమయం. భగవంతుని సృష్టి. దానికి కొన్ని ప్రకృతి ధర్మాలు, సూత్రాలు, నియమాలు భగవంతుడు ఏర్పాటు చేశాడు. దానికి మానవుడే కాదు, చివరకు ఆ పరమాత్మ కూడా ఈ ప్రకృతి ధర్మాలను మార్చలేదు. మార్చడు. అవతరించుట, అంతరించుట తిరిగి అవతరించుట ప్రకృతి ధర్మం. ఇందులో పరమాత్మ మాత్రమే సత్య స్వరూపుడని వేదాలు చెబుతున్నాయి.
<<-se>>#VedicVibes<<>>

News October 21, 2025

బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? అప్పుడేం చేయాలి?

image

బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి 96 నిమిషాల ముందు వచ్చే పవిత్ర సమయం. ఇది 48 నిమిషాల పాటు ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం.. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సమయం. ఈ వేళ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయం జ్ఞానం, శారీరక పెరుగుదలకు అనుకూలం. ఈ వాతావరణంలో ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలు చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దైవ శక్తిని పెంపొందించుకోవడానికి ఇది ఉత్తమ సమయం.

News October 21, 2025

పాకిస్థాన్ వన్డే కెప్టెన్‌గా షాహిన్ అఫ్రీది

image

మెన్స్ టీమ్ వన్డే కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తొలగించింది. బౌలర్ షాహీన్ అఫ్రీదిని నూతన సారథిగా నియమించింది. వచ్చే నెల 4న దక్షిణాఫ్రికాతో మొదలయ్యే మూడు వన్డేల సిరీస్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 25 ఏళ్ల ఈ పేసర్ 66 వన్డేల్లో 131 వికెట్లు తీశారు. 2024లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం అఫ్రీదికి ఉంది.