News July 13, 2024
విలీనం కాదు.. BSNL చేతుల్లోకి MTNL కార్యకలాపాలు?

నష్టాల్లో ఉన్న మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) కార్యకలాపాలను BSNLకు అప్పగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుల్లో కూరుకుపోయిన ఆ సంస్థను BSNLలో విలీనం చేయడం సరికాదని, కార్యకలాపాల బదిలీ ఉత్తమమని భావిస్తోందట. దీనిపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకొని దాన్ని కార్యదర్శుల కమిటీ ముందుంచనుంది. కాగా, MTNL నష్టాలు 2023FYలో రూ.2,915.1 కోట్లు ఉండగా FY24లో రూ.3,267.5 కోట్లకు చేరాయి.
Similar News
News December 24, 2025
400 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

బ్యాంక్ ఆఫ్ ఇండియా 400 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు రేపటి నుంచి జనవరి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. ముందుగా NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంపికైన అప్రెంటిస్లకు నెలకు రూ.13,000 చెల్లిస్తారు. వెబ్సైట్: https://bankofindia.bank.in/
News December 24, 2025
బల్లెం వీరుడికి HAPPY BIRTHDAY

ఇండియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పుట్టినరోజు నేడు. టోక్యో ఒలింపిక్స్లో చారిత్రక స్వర్ణంతో దేశ దశాబ్దాల నిరీక్షణకు తెరదించారు. పారిస్ ఒలింపిక్స్లో రజతం సాధించి సత్తా చాటారు. వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్, డైమండ్ లీగ్ టైటిల్ గెలుచుకున్నారు. సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందారు. ఇటీవలే 90.23M త్రోతో రికార్డు సృష్టించిన నీరజ్.. మరిన్ని మెడల్స్ సాధించాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
News December 24, 2025
చేవెళ్ల ప్రమాదం.. ప్రధాన నిందితుడిగా టిప్పర్ ఓనర్

TG: చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద NOV 3న RTC బస్సు-టిప్పర్ ఢీకొన్న <<18212535>>ఘటనలో<<>> టిప్పర్ డ్రైవర్ సహా18 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో టిప్పర్ ఓనర్ లచ్చు నాయక్ను పోలీసులు తాజాగా ప్రధాన నిందితుడిగా చేర్చారు. టిప్పర్ ఓవర్ లోడే ప్రమాదానికి కారణమని, ఆ సమయంలో అతడు టిప్పర్లోనే ఉన్నాడని తేల్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన లచ్చు నాయక్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.


