News October 9, 2025
మంత్రులెవరూ HYDలో ఉండవద్దు: సీఎం రేవంత్

TG: స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మంత్రులు హైదరాబాద్‌కు పరిమితం కాకూడదని సీఎం రేవంత్ ఆదేశించారు. అందరూ క్షేత్రస్థాయిలో పనిచేయాలని జూమ్ సమావేశంలో సూచించారు. ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయొద్దన్నారు. రిజర్వేషన్లపై హైకోర్టు వాదనలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు.
Similar News
News October 9, 2025
DANGER: ఈ రంగు కార్లు కొంటున్నారా?

సురక్షితంగా డ్రైవింగ్ చేసినా వాహనం రంగు కూడా ప్రమాదాలకు గురి చేస్తున్నట్లు AUSలోని మోనాష్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. నలుపు రంగు(47%) విజిబిలిటీ తక్కువగా ఉండటంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయంది. Gray 11%, సిల్వర్ రంగు 10%, నీలం & ఎరుపు రంగు కార్లు 7శాతం కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు తెలిపింది. తెలుపు, పసుపు, ఆరెంజ్, బంగారు రంగు కార్లకు ప్రమాదాలు తక్కువగా జరుగుతాయంది. మీది ఏ రంగు కారు?
News October 9, 2025
రిజర్వేషన్ల జీవో, నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే జీవోపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 2 రోజులు వాదనలు విన్న HC, జీవోతో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌పైనా స్టే ఇచ్చింది. ప్రభుత్వం, పిటిషనర్ దీనిపై మరిన్ని వివరాలతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దీంతో నెల పాటు ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడ్డట్లే.
News October 9, 2025
AP,TN తీరాలకు శ్రీలంకే శ్రీరామ రక్ష

రాక్షస కెరటాల నుంచి AP,TN తీరాన్ని శ్రీలంక ద్వీపకల్పం రక్షణకవచంగా కాపాడుతున్నట్లు INCOIS అధ్యయనంలో తేలింది. దక్షిణ సముద్రం నుంచి తరచూ శక్తిమంతమైన అలలు ఆగ్నేయ దిశగా దూసుకొస్తుంటాయి. కేరళ తీరాన్ని తాకి తూర్పు వైపు వ్యాపిస్తుంటాయి. ‘వాచ్‌వేవ్స్-3’ విధానంలో శ్రీలంకను అడ్డుగా తీసేసి పరిశీలిస్తే ఇవి దక్షిణ తీరాన్నిఅత్యంత వేగంతో తాకాయి. అదే శ్రీలంక అడ్డుగా ఉండగా 96% అలలు పాండిచ్చేరిని చేరడం లేదు.