News October 5, 2025

MLC వద్దు.. MLA టికెటే ముద్దు!

image

TG: జూబ్లీ‌హిల్స్ బైపోల్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ తలమునకలై ఉండగా అజారుద్దీన్ రూపంలో మరో చిక్కుముడి ఎదురవుతోంది. గవర్నర్ కోటాలో ఇస్తానన్న MLC పదవికి న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తనను జూబ్లీహిల్స్ బరిలో దించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తనను తప్పించేందుకు ఓ మంత్రి ప్రయత్నించారని, ఆయనపై ఇప్పటికే AICC నేతకు ఫిర్యాదు చేసినట్లు రాజకీయ వర్గాల్లో టాక్.

Similar News

News March 27, 2026

రాష్ట్రంలో మరో 7 రోజులు వర్షాలు

image

TG: రాష్ట్రంలో మరో 7 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. APR 3వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఆస్కారముందని చెప్పింది. ఇక రేపు 8.30am వరకు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, యాదాద్రి, RR, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

News March 27, 2026

విజయ్, త్రిష రిలేషన్‌.. సముద్రఖని ఏమన్నారంటే?

image

TVK చీఫ్ విజయ్, త్రిష కలిసి రిసెప్షన్‌కు హాజరవడంపై తాను చేసిన కామెంట్లను నటుడు, డైరెక్టర్ సముద్రఖని సమర్థించుకున్నారు. ‘రాజకీయాల్లో విజయ్‌ను తొలుత సపోర్ట్ చేసింది నేనే. అందుకే నా బాధను వ్యక్తం చేశా. వీడియో తీస్తున్న వ్యక్తి నా మాటలను మధ్యలో రికార్డ్ చేశాడు’ అని పేర్కొన్నారు. వారి రిలేషన్‌ గురించి గతంలో సముద్రఖని మాట్లాడుతూ ‘ఇదేమైనా ఆటా? వ్యక్తిగత విషయాలు అందరికీ తెలియాలా?’ అంటూ మండిపడ్డారు.

News March 27, 2026

ఇన్ఫెక్షన్లతో గుండెపోటు.. వైద్యుల సలహా ఇదే!

image

రక్తపరీక్షలు సాధారణంగా ఉన్నా, స్వల్పకాలిక ఇన్ఫెక్షన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఇవి శరీరంలో వాపును పెంచి, రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తాయి. దీనివల్ల ధమనుల్లోని ప్లాక్ పగిలి ఆకస్మిక గుండెపోటుకు దారితీయొచ్చు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కఠినమైన వ్యాయామాలు చేయకండి. నోటి పరిశుభ్రత పాటించండి. గుండె ఆరోగ్యం కోసం అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడమూ ముఖ్యమే’ అని సూచిస్తున్నారు.