News September 7, 2024
అకౌంట్లలో డబ్బులు మిగల్చలేదు: చంద్రబాబు

AP: ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ అందజేయడానికి రేషన్ కార్డు అవసరం లేదని, ఫింగర్ ప్రింట్, ఐరిష్ ఉన్నా సరిపోతుందని CM చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వం ఏ అకౌంట్లోనూ డబ్బులు మిగల్చలేదని అంతా ఊడ్చేసిందని తెలిపారు. ప్రాథమిక నివేదికను పంపితే కేంద్రం నుంచి సాయం త్వరగా వస్తుందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని సూచించారు. ఆధారాలు లేకుండా పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News August 16, 2025
కృష్ణాష్టమి రోజు ఎలా పూజ చేయాలంటే?

త్వరగా లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. చిన్నికృష్ణుడి విగ్రహం/చిత్రపటాన్ని అలంకరించుకోవాలి. కన్నయ్యకు ఆహ్వానం పలుకుతూ వరిపిండితో చిన్నికృష్ణుడి పాదముద్రలు వేసుకోవాలి. వెన్న, అటుకులు, కలకండ, నెయ్యితో చేసిన లడ్డూలు వంటివి ప్రసాదంగా సమర్పించాలి. ఈరోజు భక్తితో ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుందని, పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
News August 16, 2025
రూ.100 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్: సత్యకుమార్

AP: విశాఖ, గుంటూరు, తిరుమల, తిరుపతి, కర్నూలులో రాష్ట్రస్థాయి ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. నెల రోజుల్లో తిరుమల, విశాఖలో టెస్టింగ్ ప్రారంభిస్తామన్నారు. ల్యాబొరేటరీల నిర్మాణం, ఆధునికీకరణకు దాదాపు రూ.100 కోట్లు వెచ్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
News August 16, 2025
త్వరలోనే 2,511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP: విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. 1,711 జూనియర్ లైన్‌మెన్, 800 AEE పోస్టులను భర్తీ చేయనున్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కో వివిధ కేడర్లలో 7,142 పోస్టులు ఖాళీగా ఉండగా ఒకేసారి కాకుండా ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేస్తే సంస్థలపై ఆర్థిక భారం పడదని అధికారులు CMకు వివరించారు. సాధ్యమైనంత త్వరగా 2,511 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించగా, త్వరలోనే నోటిఫికేషన్ రానుంది.