News July 1, 2024

ఇకపై 420 కాదు 318!

image

చీటింగ్ కేసుకు పాత చట్టంలో ఉన్న సెక్షన్ 420ని కేంద్రం భారతీయ న్యాయ సంహితలో తొలగించింది. ఇకపై ఆ నేరం సెక్షన్ 318 పరిధిలోకి వస్తుంది. దేశద్రోహాన్ని సెక్షన్ 124A నుంచి 152కి, పరువునష్టాన్ని సెక్షన్ 499 నుంచి 356కి, అత్యాచార నేరాన్ని సెక్షన్ 375 నుంచి 63కి, సెక్షన్ 376Dని తొలగించి గ్యాంగ్ రేప్‌ నేరాన్ని సెక్షన్ 70(1) పరిధిలోకి తీసుకొచ్చింది. సెక్షన్ 302ను (హత్యా నేరం) SEC 103 పరిధిలోకి తెచ్చింది.

Similar News

News July 3, 2024

ఇషాన్ కిషన్ కెరీర్ ముగిసినట్లేనా?

image

టీమ్ ఇండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లే కనిపిస్తోంది. భారత్ తరఫున ఏ సిరీస్‌కూ BCCI ఇషాన్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. చివరకు జింబాబ్వే టీ20 పర్యటనకు కూడా ఆయనను సెలక్ట్ చేయలేదు. సౌతాఫ్రికా పర్యటనకు ముందు ఇషాన్ అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నారు. కానీ బోర్డుతో విభేదాలు తలెత్తడంతో సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయారు.

News July 3, 2024

భారత్ తన బ్రాండ్ నిలబెట్టుకుంది: పాక్ క్రికెటర్

image

T20 WC గెలిచి మరోసారి టీమ్ ఇండియా తన బ్రాండ్ నిలబెట్టుకుందని పాక్ పేసర్ షాహీన్ అఫ్రీది ప్రశంసలు కురిపించారు. ఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడారు. ‘ఫైనల్‌లో రెండు జట్లూ హోరాహోరీగా పోరాడాయి. ఒత్తిడిని తట్టుకుని ఏ జట్టు రాణిస్తుందో అదే ఛాంపియన్‌గా నిలుస్తుంది. ఫైనల్లో టీమ్ ఇండియా ఒత్తిడిని జయించి విజేతగా నిలిచింది. కప్ అందుకునేందుకు భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

News July 3, 2024

హేమంత్ సోరెన్‌కు మళ్లీ సీఎం పగ్గాలు?

image

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మళ్లీ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు ఇవాళ ఆయనను శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. ల్యాండ్ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో హేమంత్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో 5 నెలలు జైల్లో ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయగా చంపై సోరెన్‌ ముఖ్యమంత్రి అయ్యారు.