News August 23, 2024

విండోస్‌లో ఇకపై నో కంట్రోల్ ప్యానల్!

image

దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన విండోస్ OSలోని కంట్రోల్ ప్యానల్‌ని సెట్టింగ్స్‌ ఆప్షన్‌తో రీప్లేస్ చేయనుంది. ఈ ఆప్షన్‌ అనవసరం అనే అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 1985లో వచ్చిన విండోస్ 1.0 వెర్షన్ నుంచి కంట్రోల్ ప్యానల్ యూజర్లకు సుపరిచితం. విండోస్‌ 11లోనూ దీనిని కొనసాగించారు. 2012లో వచ్చిన విండోస్ 8 వెర్షన్ నుంచి OS ఇంటర్‌ఫేస్‌లలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి.

Similar News

News December 29, 2025

IIT ధన్‌బాద్‌లో 105 పోస్టులు… అప్లై చేశారా?

image

<>IIT <<>>ధన్‌బాద్‌లో 105 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. వీటిలో ఎస్సీలకు 32, ఎస్టీలకు 20, ఓబీసీలకు 53 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ /డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు Asst. profకు రూ.70,900, Asst. prof గ్రేడ్- 1కు రూ.1,01,500, అసోసియేట్ profకు రూ.1,39,600, profకు రూ.1,59,100 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.iitism.ac.in

News December 29, 2025

వివక్షపై భారతీయుడి పోరాటం.. అహంకారానికి ₹81 లక్షల గుణపాఠం

image

బ్రిటన్‌లోని ఓ KFC అవుట్‌లెట్‌లో పనిచేసే తమిళనాడు యువకుడు మాధేశ్ రవిచంద్రన్ జాతి వివక్షపై కోర్టులో పోరాడి గెలిచాడు. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం మాధేశ్‌ను శ్రీలంక తమిళుడైన తన మేనేజర్ ‘బానిస’ ‘భారతీయులంతా మోసగాళ్లు’ అని అవమానించేవాడు. తట్టుకోలేక మాధేశ్ ఉద్యోగానికి రాజీనామా చేసి కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం సుమారు ₹81 లక్షల పరిహారం చెల్లించాలని మేనేజర్‌ను ఆదేశించింది.

News December 29, 2025

ఐదేళ్లలోపు పిల్లలకు ఇవి పెట్టకూడదు

image

పిల్లలకు కొన్నిరకాల ఆహారపదార్థాలు పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఏడాదిలోపు పిల్లలకు తేనె పెడితే బొట్యులిజం అనే వ్యాధి వస్తుంది. దీంతో చిన్నారుల్లో చూపు మందగించడం, అలసట, నీరసం వస్తాయి. అలాగే పాశ్చరైజేషన్‌ చేయని పాలు, జ్యూసులు, పెరుగులో ఈ.కొలి బ్యాక్టీరియా పెరిగి విరేచనాలు, బరువు తగ్గడం వంటివి జరుగుతాయి. అలాగే స్వీట్లు, ఉప్పు కూడా ఎక్కువగా ఇవ్వకూడదని సూచిస్తున్నారు.