News September 4, 2024

ఈ ఐడ్రాప్స్‌తో కళ్లజోడుకు స్వస్తి!

image

రీడింగ్ గ్లాసెస్ లేకుండా చదవలేకపోతున్నారా? మీకో గుడ్ న్యూస్. ముంబైకి చెందిన ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన PresVu ఐ డ్రాప్స్‌ను భారత ఔషధ నియంత్రణ ఏజెన్సీ ఆమోదించింది. దీని ద్వారా 40 ఏళ్లు పైబడిన వారు రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తగ్గించవచ్చు. CDSCOకు చెందిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఈ ఐడ్రాప్స్‌ను సిఫార్సు చేసింది. వచ్చే నెల నుంచి ఇది అందుబాటులో ఉండనుంది.

Similar News

News January 21, 2026

జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’

image

AP: పర్యాటక శాఖ JAN 24-FEB 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనుంది. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్‌తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలో 9 రోజులపాటు ఉత్సవం జరగనుంది. విశాఖలో JAN 24-31 వరకు, JAN 29, 30 అనకాపల్లిలో, JAN 30-FEB 1 వరకు అరకు లోయలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనిలో 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 3000 మందికి ప్రత్యక్ష, 1800 మంది సహాయకులకు ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.

News January 21, 2026

జనవరి 21: చరిత్రలో ఈరోజు

image

1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం

News January 21, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.