News May 3, 2024
GOVT యాప్స్‌కు ఇకపై లేబుల్స్..

గూగుల్ ప్లే స్టోర్‌లో ఎన్నో ఫేక్ యాప్స్‌తో ప్రజలు మోసపోతున్నారు. ఆఖరికి ప్రభుత్వ లోగోతో కూడా ఫేక్ యాప్స్ దర్శనమిస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. ఇకపై GOVT యాప్స్‌కు లేబుల్స్(Xలో గ్రే టిక్ తరహాలో) ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఆ లేబుల్‌పై క్లిక్ చేస్తే వెరిఫైడ్ అని చూపుతుంది. భారత్‌తో పాటు 14 దేశాల్లో ఈ లేబుల్స్ త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
Similar News
News December 27, 2025
‘మేకపోతుల బలి’ రాజకీయం!

AP: ఈ నెల 21న జగన్ పుట్టినరోజు సందర్భంగా చాలా చోట్ల YCP కార్యకర్తలు, అభిమానులు మేకపోతులను బలి ఇచ్చారు. వాటి రక్తాన్ని జగన్ ఫ్లెక్సీలపై చల్లుతూ, రప్పారప్పా నినాదాలు చేశారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఇవాళ తూ.గో. జిల్లాలో ఏడుగురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా సినిమా రిలీజ్‌ల సందర్భంగా హీరోల ఫ్లెక్సీలపై రక్తం చల్లితే తప్పు లేదా అని వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
News December 27, 2025
ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇవి కూడా కారణం కావొచ్చు

ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ రావడానికి ఎన్నో అంశాలు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆలస్యంగా నిద్రపోవడం, అధిక ఒత్తిడికి గురవడం, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, అధిక/ తక్కువ బరువు, ధూమపానం వంటి అలవాట్ల వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందంటున్నారు. అందుకే ముందుగా పీరియడ్స్, ప్రెగ్నెన్సీ గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.
News December 27, 2025
అంటే.. ఏంటి?: Backyard

ఇంటి వెనక పెరటిని Backyard అంటారు. ఇది Back, Yard పదాలను కలిపితే వచ్చింది. Back అనే ఇంగ్లిష్ పదానికి వెనక అని అర్థం. జర్మన్లో Gard అంటే తోట. ఆ పదాన్ని ఇంగ్లిష్‌లోని స్థలం కొలిచే ప్రమాణమైన Yardతో పోలుస్తూ BackYardగా పిలుస్తున్నారు.
రోజూ 12pmకు ఓ ఆంగ్ల పదం అర్థం, వివరణ, పుట్టుక
<<-se>>#AnteEnti<<>>


