News April 11, 2024
ఒలింపిక్స్ విజేతలకు ఇకపై ప్రైజ్మనీ

ఒలింపిక్స్లో పథకాలు సాధించే అథ్లెట్లకు ఇక నుంచి నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వరల్డ్ అథ్లెటిక్స్ ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్లో 48విభాగాల్లో గోల్డ్ మెడలిస్టులకు ప్రైజ్మనీ ఇవ్వనున్నట్లు తెలిపింది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో స్వర్ణం, రజతం, కాంస్య విజేతలకు నగదు ఇస్తామని వెల్లడించింది. ఇలా ప్రైజ్మనీ ఇచ్చే మొదటి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యగా WA నిలవనుంది.
Similar News
News November 25, 2025
మణుగూరు: ‘కలెక్టర్ గారూ.. జర ఇటు చూడండి’

మణుగూరులోని చినరావిగూడెంలో ఇసుక ర్యాంపుల కోసం అడవిలోని చెట్లను కొందరు నరికేశారని, ఇసుక అక్రమ రవాణా కోసం తాత్కాలికంగా రోడ్లను నిర్మించుకుంటున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. చట్టాలు ఏమయ్యాయని, పోడు రైతులకు ఒక న్యాయం, అక్రమార్కులకు ఒక న్యాయమా అని వారు ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏళ్లుగా చెట్లని తొలగిస్తున్నా జిల్లా కలెక్టర్ స్పందించరా అని అడుగుతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రశాంతతను ప్రసాదించే విష్ణు నామం..

అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ||
అమృతాన్ని ఇచ్చే చంద్రుడి నుంచి ఉద్భవించిన, దేవకీ నందనుడు అయిన కృష్ణుడి శక్తి కలిగిన, త్రిసామ అనే వేదాల సారం కలగలసిన పవిత్ర శ్లోకమిది. విష్ణు సహస్ర నామాల్లో ఒకటైన ఈ మంత్రాన్ని పఠిస్తే జ్ఞానం లభిస్తుందని నమ్మకం. మనకు తెలియకుండానే అంతర్గత శక్తి పెరిగి మనశ్శాంతి దొరుకుతుందని చెబుతారు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>