News September 14, 2024
ఇకపై కావాలనుకున్నప్పుడు వర్షం!

వర్షాన్ని వద్దనుకుంటే ఆపేలా, కావాలంటే రప్పించేలా భారత శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా ‘మిషన్ మౌసమ్’ను కేంద్రం ఆమోదించింది. అతివృష్టి, అనావృష్టిని నివారించాలనేదే దీని ఉద్దేశం. వడగండ్లు, ఉరుములు, మెరుపులనూ నియంత్రించే దిశగా ఆలోచిస్తున్నారు. క్లౌడ్ సీడింగ్(కొన్ని పదార్థాలను ఆకాశంలోకి పంపి మేఘాలను ప్రభావితం చేయడం) చేయడం వల్ల నీటి ఆవిరి జలంగా మారి వర్షం కురుస్తుంది.
Similar News
News January 6, 2026
మళ్లీ ‘గుడ్ మార్నింగ్’ ప్రారంభిస్తా: కేతిరెడ్డి

త్వరలోనే మళ్లీ ‘గుడ్ మార్నింగ్’ కార్యక్రమం ప్రారంభిస్తానని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వానికి రెండేళ్ల సమయం ఇచ్చినా ప్రజలకు మేలు జరగలేదని విమర్శించారు. తనపై భూకబ్జా ఆరోపణలు చేసిన వారు గాలి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో నేతలు మౌనంగా ఉన్నారని, ఉపాధి హామీ పనులు ఆగితే ప్రజలు వలస వెళ్లాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
News January 6, 2026
నేటి నుంచి మలేషియా ఓపెన్

గత ఏడాది నిరాశపరిచిన భారత షట్లర్లు కొత్త సీజన్‌కు సిద్ధమయ్యారు. నేటి నుంచి జరిగే మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక, ఉన్నతీ హుడా, డబుల్స్‌లో పుల్లెల గాయత్రీ-ట్రీసా జాలీ, మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ పోటీ పడనున్నారు. అక్టోబర్ తర్వాత సింధు ఆడుతున్న టోర్నీ ఇదే కావడంతో ఆమె ఎలా రాణిస్తారో చూడాలి.
News January 6, 2026
బిట్‌కాయిన్ స్కామ్.. శిల్పా శెట్టి భర్తకు కోర్టు నోటీసులు

బిట్‌కాయిన్ స్కామ్‌లో హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ED దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న PMLA ప్రత్యేక కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. బిట్‌కాయిన్ పోంజీ స్కామ్ సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుంచి ఆయన 285 బిట్‌కాయిన్లు (రూ.150 కోట్లకు పైగా విలువ) తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జనవరి 19న హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.


