News May 23, 2024
16 ఏళ్లలోపు వారికి ఇక నో సోషల్ మీడియా.. ఎక్కడంటే?

పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా చూడకుండా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై చట్టం చేసేందుకు ఆ దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటు ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా మద్దతు తెలిపారు. పిల్లలు ఆన్లైన్లో కాకుండా మైదానాల్లో ఆడుకునేలా చేయడం, సోషల్ మీడియా వల్ల వారు దారితప్పకుండా, మానసికంగా దెబ్బతినకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Similar News
News October 30, 2025
542 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)లో 542 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత గలవారు NOV 24లోపు అప్లై చేసుకుని రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. వెహికల్ మెకానిక్, MSW పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ITI ఉత్తీర్ణులు అర్హులు. రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, PET, ట్రేడ్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్:bro.gov.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం<<-se_10012>> జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 30, 2025
జేజమ్మగా శ్రీలీల.. నిర్మాతగా అల్లు అరవింద్?

అనుష్క నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘అరుంధతి’ 16 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో రీమేక్ కానున్నట్లు సమాచారం. ఇందులో జేజమ్మగా శ్రీలీల నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తారని, ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని టాక్. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News October 30, 2025
జగన్ ఫోన్ నంబర్ పిటిషన్ కొట్టివేత

AP మాజీ CM జగన్ లండన్ పర్యటన సందర్భంగా వేరే ఫోన్ నంబర్ ఇచ్చారంటూ CBI దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టేసింది. విదేశీ పర్యటనలో అందుబాటులో ఉన్నారా లేదా? మాత్రమే చూడాలంది. ఆయన పర్యటన నుంచి తిరిగొచ్చినందున CBI పిటిషన్కు కాలం చెల్లిందని పేర్కొంది. జగన్ ఎప్పుడు స్వదేశానికి వచ్చారో వివరాలతో మెమో దాఖలు చేయాలంది. పెద్ద కుమార్తెను చూసేందుకు OCT 11న జగన్ లండన్ వెళ్లిన విషయం తెలిసిందే.


